NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

BB3 Movie : సింహా..! లెజెండ్..! మూడో పేరు వింటే పూనకాలే..!?

BB3 Movie : name How Important for BB

BB3 Movie : మాస్ నాడి బాగా పెట్టగల దర్శకుడు Boyapati Srinu. మాస్ నటనలో ఇరగదీయగల సత్తా ఉన్న హీరో Nandamuri Balakrishna బాలయ్య..! ఈ ఇద్దరి కలయికలో వచ్చిన మొదటి రెండు సినిమాలు (Simha, Legend) సూపర్ హిట్టే. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి సినిమా కలయికలో రాబోతున్న మూడో (BB3 Movie) ఇప్పుడు ఊరిస్తుంది..! మే 21 తేదీన థియేటర్లలో వస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటూ.., బీ, సి సెంటర్ల ఆడియన్స్ కూడా వేచి చూస్తున్నారు. ఈ మూడో సినిమా పేరు ఇదే అంటూ ఒక గాసిప్పు నెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేమిటో చెప్పుకునే ముందు ఈ ఇద్దరికీ ఈ సినిమా కీలకమే. బోయపాటి కెరీర్ కి ఇది టానిక్ లా పని చేయాలి. బాలయ్య కెరీర్ క్లిష్ట దశలో ఉన్న రెండు సార్లు బోయపాటి మంత్రం పని చేసింది. ఇప్పుడు కూడా పని చేస్తుందో లేదో చూడాలి. ఈ ఇద్దరికీ ఈ సినిమా ఎంత ప్రాధాన్యమో ఓ సారి చెప్పుకుందాం..!!

BB3 Movie : name How Important for BB
BB3 Movie : name How Important for BB

BB3 Movie : బోయపాటికి మలుపు ఇదే..!!

ఎన్ని హిట్ సినిమాలు తీశామన్నది కాదు.. హిట్ లలో నిలకడ.., ఒక కొత్త ఫార్ములా.. ప్రేక్షకులను మెప్పించగల సమర్ధత ముఖ్యం. బోయపాటిలో ఇవి కాస్త లోపించాయి. అలా అని అతని సత్తాకి, సమర్ధతకి ఇది విమర్శ కాదు.. అప్రమత్తత మాత్రమే..! దర్శకుడు ఎంత గొప్పవాడైనా.., ఎన్ని హిట్ సినిమాలు అందించినా కొన్ని ఫ్లాప్ సినిమాలు దర్శకుడి గత చరిత్రని వెనక్కు నెట్టేసిన ఉదాహరణలు తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నాయి.
* ఢీ, రెఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్షా… వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన శీను వైట్ల ఒక్క సినిమాతో కిందకి పడిపోయారు. 2014 లో వచ్చిన ఆగడు.. శీను వైట్ల కెరీర్ ని ఆపేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బ్రూస్లీ తీసినా దశ మారలేదు. గత ఏడాది వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా శీను వైట్ల దశ మార్చలేదు. అలా ఆ టాప్ హిట్ దర్శకుడు మూలకు చేరారు.
* బొమ్మరిల్లు, పరుగు వంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమకు భావి దర్శక తారలా కనిపించిన భాస్కర్ కూడా అదే పరిస్థితి. ఆరేంజ్ సినిమా అతని కెరీర్ ని మలుపు తిప్పేసింది. ఆ సినిమా ఒక కొత్త ఫార్ములాతో రూపొందించినప్పటికీ ఎక్కలేదు. దీంతో భాస్కర్ కెరీర్ కూడా పడిపోయింది. మూడేళ్ళ గ్యాప్ తీసుకుని “ఒంగోలు గిత్త” రూపొందించారు. ఇది కూడా పోవడంతో దాదాపు ఏడేళ్లు భాస్కర్ అడ్రెస్స్ లేదు. ఇప్పుడు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్” సినిమాతో మళ్ళీ వస్తున్నారు.

Must Read : చంద్రబాబుకి సీన్ లేదు.. జగన్ ఏం చేయలేరు.. పవన్ షో చేస్తారు..!! (కీలక విశ్లేషణ)

BB3 Movie : name How Important for BB
BB3 Movie : name How Important for BB

సో… ఇలా కొన్ని ఉదాహరణలు, కొందరి పాఠాలు ద్వారా బోయపాటి కూడా కొంచెం అప్రమత్తమవ్వాల్సిన సినిమా ఇది. ఆయనకు లెజెండ్ తర్వాత సరైనోడు హిట్ ఉంది. ఆ తర్వాత సరైన హిట్ లేదు. జయ జానకి నాయక మాస్ ఎక్కువైపోయి పోతే.., వినయ విధేయ రామ లాజిక్కులు లేక.. పిచ్చి పిచ్చి కథనంతో బోయపాటిని ప్రమాదంలోకి నెట్టేసింది. సో… బీబీ 3 కచ్చితంగా బోయపాటి కెరీర్ కి మలుపు అని చెప్పుకోవాల్సిందే.

BB3 Movie : name How Important for BB
BB3 Movie : name How Important for BB

బాలయ్య… జాగ్రత్తయ్య..!!

బాలకృష్ణ గురించి కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు… కానీ ప్రస్తుతం అతని కెరీర్ కి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత అవసరమో చెప్పుకుందాం.. బాలకృష్ణ కి లెజెండ్ తర్వాత సరైన హిట్ లేదు. పైసా వసూల్, డిక్టేటర్, లయన్, గౌతమి పుత్ర శాతకర్ణి, కథానాయకుడు, మహానాయకుడు వంటి సినిమాలు వచ్చిన ఏవీ బాలకృష్ణ రేంజి అందుకోలేదు. అరకొరగా ఆడేసి వెళ్లిపోయాయి. బాలకృష్ణ అనుభవానికి, రేంజికి తగ్గ హిట్ లేక ఏడేళ్లు అవుతుంది. 2004 లో వచ్చిన “లక్ష్మి నరసింహ” నుండి 2010 లో వచ్చిన సింహా వరకు బాలకృష్ణ కి హిట్ లేదు. సో.. బాలకృష్ణ కెరీర్ కి సింహాతో గట్టెక్కించింది బోయపాటి. అలాగే 2010 లో వచ్చిన సింహా నుండి 2014 లో వచ్చిన లెజెండ్ వరకు హిట్ లేదు. సో.. మళ్ళీ బాలయ్య కెరీర్ కి బోయపాటి గట్టెక్కించారు. ఇప్పుడు కూడా బాలయ్య అదే దశలో ఉన్నారు. ఈ బీబీ 3 హిట్ అయితేనే బాలయ్య మరో ఐదేళ్లు కళ్ళు మూసుకుని హీరోగా చేసేస్తారు. లేకపోతే అతని అభిమానులు కూడా జీర్ణించుకోలేరు..!!
“అంచేత ఈ బీబీ 3 అనే సినిమా ఈ ఇద్దరికీ కెరీర్ కి అమృతంలా పని చేయాలి. తెలుగు సినీ పరిశ్రమకి ఆణిముత్యంగా మిగిలిపోవాలి. ఇంతకు ఈ సినిమా పేరు ఏంటా..? అని ఎదురు చూస్తే… “మోనార్క్” అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం ప్రకటించాల్సి ఉంది..!!

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri