Bheemla nayak: థమన్ సంగీత దర్శకుడిగా తన సత్తా ఏ రేంజ్లో చాటుతున్నాడో ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలను చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒకే ఒక్క సంగీత దర్శకుడి పేరు థమన్. సినిమాకు సంగీతం అందించడమే కాదు సినిమా రిలీజ్‌కు ముందు థమన్ తన ట్రూప్‌తో చేస్తున్న ప్రమోషన్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉంటున్నాయి. వకీల్ సాబ్ సినిమా నుంచి కొత్త సాంగ్‌ను లిరికల్ వీడియోతో విడుదల చేసినప్పుడు కొత్తగా వీడియో సాంగ్‌ను మేకింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఇవి జనాలలోకి బాగా వెళుతున్నాయి. అంతేకాదు, ఆయా హీరోల అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సాంగ్స్ కూడా ఇలాగే స్పెషల్‌గా ఉండి అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. లా లా భీమ్లా సహా ఈ సినిమాలో ఉన్న పాటలన్నీ అలా ఆకట్టుకున్నవే. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ కూడా ఇలా స్పెషల్ మేకింగ్ వీడియోతో భారీగా హైప్ తీసుకువచ్చాడు. తమిళంలో విజయ్ – పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుత్తు సాంగ్‌తో కళావతి సాంగ్ పోటీపడి ట్రెండింగ్‌లో నిలిచింది.
Bheemla nayak: రాబోయో అప్డేట్తో అందరూ ఫుల్ ఖుషీ..!
ఇలా తన సత్తా చాటుతున్న సంగీత దర్శకుడు థమన్ తాజాగా పవర్ స్టార్ అభిమాను లను సాలీడ్ అప్డేట్ ఇచ్చాడు. భీమ్లా నాయక్ సినిమా సందడి అప్పుడే అయిపోలేద ని.. ఇంకా ఉందని..ఇప్పుడు రాబోయో అప్డేట్తో అందరూ ఫుల్ ఖుషీ అవుతారని తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో భీమ్లా నాయక్ రాప్ సాంగ్ రాబోతుందని అది మరో రేంజ్లో ఉంటుందని పేర్కొన్నాడు. ఇంతక ముందు న్యూ ఇయర్ సందర్భంగా డీజే వెర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడేమో ర్యాప్ సాంగ్‌ను వదలబోతు న్నారు. మొత్తానికి ఇంకా పవన్ మేనియా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. కాగా, త్వరలో ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ట్రైలర్ కూడా వచ్చి ఆకట్టుకుంటోంది.