NewsOrbit
న్యూస్ సినిమా

RRR: రాజమౌళి ఒక్కడే.. బాలీవుడ్ స్టార్ క్రేజీ కామెంట్స్ వైరల్..!

RRR: రాజమౌళి ఒక్కడే..అంటూ బాలీవుడ్ స్టార్ తాజాగా క్రేజీ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శక ధీరుడికి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా పడింది లేదు. ప్రతీ సినిమాకు అంచనాలు పెంచుతూ వచ్చిన రాజమౌళి బాహుబలి సినిమాల తర్వాత తన సత్తా రేంజ్ మార్కెట్‌ను విపరీతంగా పెంచుకున్నారు. ఏ నిర్మాత అయినా ఇంత బడ్జెట్ అవుతుందీ అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రాజెక్ట్ చేసేద్దాం అని రెడీ అవుతాడంటే అది బహుషా ఒక్క రాజమౌళి విషయంలోనే.

bollywood-star-crazy-comments-on-rajamouli-going-viral
bollywood-star-crazy-comments-on-rajamouli-going-viral

అంతగా తన సినిమాల మీద ప్రభావం చూపిస్తున్నారు. రాజమౌళి అంటే బడ్జెట్  పెరుగు తున్నా నిర్మాత భయపడడు. అందుకు కారణం పెట్టిన రూపాయికి నాలుగింతలు లాభాలు తెచ్చిపెడతారు కాబట్టి. నేను నిర్మాతతో బడ్జెట్ కాస్త ఎక్కువే పెట్టిస్తానని స్వయంగా ఎప్పుడో 2010లోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు సరదాగా అనుకున్న మాటలు ఇప్పుడు రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్‌లతో మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ తీసి నిజం చేశారు. దాదాపు 12 ఏళ్ళ క్రితం నాకు మల్టీస్టారర్ తీయాలనే కోరిక ఉంది అని అన్న జక్కన్న బాహుబలి సిరీస్, ఇప్పుడు ఆర్ఆర్ఆ సినిమాలతో
అది నెరవేర్చుకున్నారు.

RRR: ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాదు, తెలుగు వాడి వేడి ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ సినిమాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదిలా ఉంటే గత వారం వచ్చిన ఆర్ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ వసూళ్ళతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ మూవీపై, దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హాలీవుడ్ సినిమాలను కూడా బాక్సాఫీస్ వద్ద బీట్ చేసి దూసుకు వెళ్తుంది. ఈ విషయంలో చాలా గర్వంగా ఉంది.. అన్నాడు. అంతేకాదు, ఇదే సమయంలో ఎంతో ఉత్సాహంగా తెలుగులో నాటు నాటు సాంగ్ పాడి సర్‌ప్రైజ్ చేశాడు. చివరిగా డైరెక్టర్ రాజమౌళి.. ఇలాంటి గ్రేట్ సినిమాలతో ఇండియన్ సినిమాను ప్రపంచమంతా వ్యాపించే లా చెయ్యడం చాలా సంతోషంగా ఉంది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?