మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో `RRR` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు యంగర్ వెర్షన్లో నటిస్తుంటే.. మరో స్టార్ హీరో ఎన్టీఆర్ యంగర్ వెర్షన్ ఆఫ్ కొమరంభీమ్గా కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరకి `RRR` చిత్రీకరణ ముగుస్తుంది. మరి తదుపరి చరణ్ ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం రాంచరణ్ ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడట. గీతాఆర్ట్స్ సంస్థ దర్శకత్వ టీంలో చాలా రోజులుగా పనిచేస్తున్న దర్శకుడు తెరకెక్కించబోయే సినిమా చేయడానికి చరణ్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత. చరణ్ మేనమామ అల్లు అరవింద్ నిర్మిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. మరి చివరకు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.
previous post
next post