ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో చంద్రబాబు ఓటు వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.

తెలంగాణలో రెండు టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా… ఏపీలో ఒక టీచర్‌, రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.