మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా లేదా? ఇంతకు చిరుకు ఆసక్తి లేనివి సినిమాలా? రాజకీయాలా?.. అంటే రాజకీయాలే.. ఎందుకంటే సినిమా రంగంలో మకుటం లేని రాజుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం.. అక్కడ నుండి మళ్లీ సినిమాల్లోకి రావడం జరిగిపోయాయి. చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఆయన 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` షూటింగ్దశలోనే ఉంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రాజకీయాల్లో చిరు యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతం చిరు సైరా చిత్రీకరణలో భాగంగా చైనాలో 20 రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఇది ఎన్నికల సమయంలోనే కావడంతో చిరు.. కామ్‌గా చైనా వెళ్లిపోతున్నారట. ఇక్కడే ఉంటే ఇటు తమ్ముడు జనసేనకో.. అటు కాంగ్రెస్‌కో తన మద్ధతుని తెలిపాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకని అనుకున్నాడో ఏమో కానీ.. అసలు ఇండియాలోనే ఉండకుండా విదేశాలకు చెక్కేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. వార్తలు ఎలా ఉన్నా.. చిరు మాత్రం తన సైరా నరసింహారెడ్డి చిత్రీకరణను పూర్తి చేసేయాలనుకుంటున్నాడు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ ఏడాదిగా చిరు కోసం వెయిట్ చేస్తున్నారు మరి.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!