Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా, రష్మిక శ్రీవల్లిగా నటించి.. తమదైన నటనతో ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకున్నారు. అలాగే సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ప్రతి పాటను జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని `శ్రీవల్లి` సాంగ్, అందులో బన్నీ వేసిన స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో, ఏ రేంజ్లో క్రేజ్‌ను సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం శ్రీవల్లి స్టెప్పులను వరల్డ్ ఫేమస్ క్రికెటర్లు ఇమిటేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా తో పాటు విదేశీ క్రికెటర్లు పుష్పరాజ్ ను అనుకరిస్తూ శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. ఇక తాజాగా టీమిండియా సీనియర్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.
అశ్విన్ అందరిలా కాకుండా శ్రీవల్లి పాటకు బ్యాట్ చేత పట్టి డిఫరెంట్‌గా స్టెప్పులేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా.. అశ్విన్ డ్యాన్స్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అయిపోయారు.
https://www.instagram.com/reel/CZTdbj6IMsa/?utm_source=ig_web_copy_link
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!