Deepika Padukone: ఒకానొక సమయంలో స్టార్ సెలబ్రిటీస్ తల్లి అవ్వడానికి చాలా సంకోచించేవారు. తల్లి అవడం ద్వారా తమ గ్లామర్ మరియు ఫిజిక్ ఎక్కడ పోతుందో అని కొందరు అద్దె గర్భం ద్వారా కూడా తల్లిదండ్రులు అయ్యారు. ఇక ప్రస్తుత కాలంలో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి.
తల్లితనాన్ని స్వయంగా వారే అనుభవించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు కూడా తమ బిడ్డకు జన్మనిస్తూ సంతృప్తి పొందారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ కూడా తల్లి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మకి బాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుత కాలంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే లండన్ లో జరిగిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల క్రమంలో దీపిక హోస్ట్ గా పాల్గొంది. ఇక ఈ ఈవెంట్లో దీపిక బంగారు, వెండి వర్ణంలో ఉన్న చీరలో కనిపించింది.
కాగా రెడ్ కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ఆమె చీర పట్టుకున్న విధానం ఫాన్స్ లో పలు సందేహాలు కలిగించింది. ఈమె నడక తీరు గమనించిన ఆడియన్స్ బేబీ బంప్ దాస్తున్నట్లు కనిపెట్టేశారు. దీపిక ఏమాత్రం నడుము భాగం కనిపించకుండా చీర కట్టినప్పటికీ ప్రేక్షకులు తన బేబీ బంప్ ని కనిపెట్టారు. దీంతో ఈమె తల్లి కాబోతున్నట్లు ప్రతి ఒక్కరు ఊహించారు. ఇక ఈమెని ఇలా చూసిన ఈమె ఫ్యాన్స్ ఖుషి గా ఫీల్ అవుతున్నారు. ఇక తన బేబీ బంప్ ని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి.