Devatha Serial: దేవి నీ గురించి ఎంత మంచిగా చెప్పినా వినడం లేదని.. రాధా రమ్య ఫోన్ లో నుంచి ఆదిత్యకు ఫోన్ చేసి చెబుతుంది.. నువ్వు ఏదో ఒకటి చేసి దేవిని నాతో ఒక్కసారి మాట్లాడేలా చేయి అని ఆదిత్య రాధకు చెబుతాడు.. సరే అయితే మీరు అర్జెంటుగా స్కూల్ దగ్గరికి బయలుదేరి రండి అని రాధ అంటుంది..!
రమ్య ఫోన్ లో రాధా ఆదిత్య తో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తుంది. ఆ మాటలు వాళ్ల బావ మాధవ్ కి వినిపిస్తుంది. నాకు ముందు నుంచి రాధపై అనుమానం ఉంది. మన ఇంట్లో ఉంటూ ఆఫీసర్ సార్ తో మంచిగా ఉంటుంది. నువ్వు ఆఫీసర్ సార్ తో దేవినీ మాట్లాడవద్దు అని చెబుతున్నా.. దేవి మనసులో ఆఫీసర్ పై ఇష్టం లేకపోయినా.. రాధా కావాలని ఆదిత్యకు దేవిని దగ్గర చేయాలని అనుకుంటుంది.. రాధను చూస్తే నాకు చాలా కోపంగా ఉందనీ మాధవ్ కు మనసులో రాధ పై విష భీజలను నాటుతుంది. ఈ విషయం నేనే నీకు చెప్పానని రాధ కు చెప్పకు ఆఫీసరు సార్ తో చెప్పి నా ఉద్యోగం పోయేలా చేస్తుంది.
చిన్మయి నా పుట్టినరోజు గిఫ్ట్ అని దేవికి ఒక చాక్లెట్ ఇస్తుంది. మరి అక్కకు నువ్వు ఏమి గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుంది వాళ్ళమ్మ. చిన్మయి నా పుట్టినరోజు గిఫ్ట్ గా నువ్వు ఆఫీసర్ అంకుల్ తో మాట్లాడాలి అని అంటుంది వాళ్ళ అక్క కి ఇచ్చిన మాట ప్రకారం ఆఫీసర్ సార్ తో మాట్లాడుతుంది దేవి. ఏమ్మా దేవి నామీద నీకు ఇంకా కోపం పోలేదా.. మీ అమ్మకు సారీ చెబుతాను. కావాలంటే నీ కోసం మీ అమ్మ కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాను.. అప్పుడైనా నువ్వు నాతో మాట్లాడతావా అని అంటాడు.. ఇక ఆ విషయం తెలిసిన రాధ ఎలా రియక్ట్ అవుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!