Devatha: దేవత సీరియల్ రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్టులతో ప్రేక్షకులని అలరిస్తుంది..!! వద్దు అనుకున్న బంధాలను దగ్గర చేసి మనుషులను బొమ్మలు చేసి ఆ దేవుడు ఏ విధంగా ఆడిస్తాడో.. ఈ సీరియల్ చూస్తే అర్ధవుతుంది.. సత్య పిల్లలు పుడతారని ఎదురు చూస్తూ ఉంటే.. దేవి ఆదిత్య కు మరింత దగ్గరవుతుంది.. ఈరోజు సీరియల్ 434 ఎపిసోడ్ లో ఏం జరిగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
434వ ఎపిసోడ్ హై లైట్స్..
ఆదిత్య మన మధ్య రాబోయే పులి బిడ్డ కోసం ఎదురు చూసావా ఎంత అందంగా అలంకరించానో.. అంటూ టెడ్డి బేర్స్ ని చూపిస్తూ సంతోషంగా కేరింతలు కొడుతుంది.. అంతలో చేతిలో నుంచి ఫోటో ఫ్రేమ్స్ కింద పడిపోతాయి.. రిజల్ట్స్ వచ్చాయా అని అడుగుతారు. చూసావా అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో.. అదే నాకు పాప పుడితే చనిపోయిన మా రాధ అక్కను ఆ బిడ్డకు పేరు పెట్టి తన లాగా చూసుకుంటాను అంటుంది. ఆంటీ అంటే నాకు ఇష్టమే కానీ.. మొదటి సారి ఆంటీ మాట జవదాటల్సి వస్తుంది..!! ఆంటీ కి వారసుడు కావాలంట..!! నాకు మాత్రం ఆడపిల్ల కావాలని ఉంది.. అంతలో ఆదిత్య ఏడుస్తూ నీ ఆశ నెరవేరదేమో ఏమో సత్య అంటాడు. ఏ ఎందుకు కాదు అంటూ సత్య నిలదీసి ఆదిత్య అని ఆదిత్య అని నిలదీస్తుంది ఒకవేళ బాబు పుడతాడు అమౌంట్ ఉంది అదే బాబు కొడితే మాత్రం మా రాధక్క పేరు పెట్టిస్తాను.. మా అక్క లా ఉన్న రాధ చేత అంటుంది.. అసలు సత్య కు పిల్లలు పుట్టరనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆదిత్య సతమతమవుతూ ఉంటాడు.. కట్ చేస్తే..!!
రాధా పిల్లలు ఇద్దరి తో కలిసి నిద్ర పోతూ ఉంటుంది అంతలో ఎవరో వచ్చి గట్టిగా తలుపు తడుతూ ఉంటారు.. రాధా తలుపు తీస్తే మాధవ్ ఉంటాడు.. రాధ నీతో ఒక విషయం మాట్లాడాలి. సత్యకి మన విషయం తెలుసిపోయిందని మాధవ్ రాధతో చెబుతాడు.. ఇలాంటి ఏదో జరిగిందనే సత్యం ఇంటికి తీసుకు రావటం నా మీరేమో సత్యం తీసుకొని వచ్చారు.. ఆదిత్య ని ఇంటికి రాకుండా చేస్తుందని పిల్లలకు ఆదిత్య దూరం చేస్తుందని తీసుకువచ్చాను.. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకోవాలని మాధవ్ అంటాడు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటాడు.. మంది ముంగటే కాదు ఎవరూ లేనప్పుడు కూడా మనం కలిసి ఉన్నట్లుగానే ఉండాలి అని రాధ చెబుతోంది. మధ్యాహ్నం మన ఇద్దరి మధ్య గొడవ జరగకుండా ఉంటే ఈ విషయం సత్య కి తెలిసేది కాదు.. అందుకే అందరి ముందే కాదు ఎవరూ లేనప్పుడు కూడా మనం కలిసి ఉన్నట్టుగానే ఉండాలి అని చెప్పి వెళ్లిపోతుంది..
Read More: Karthika Deepam: బిచ్చగాడు కార్తీక్ ను చూస్తాడా..? అసలు దీప ఏమైంది.. ప్రాణాలతోనే ఉందా.. లేక..?
పిల్లలు స్కూల్ కి వెళ్లి వస్తుంటే కార్ ఆగిపోతుంది.. ఎంత రిపేర్ చేసినా కాదు.. పిల్లలు తన తాతతో ఇద్దరు కలెక్టర్లు కారులో కూర్చుని ఉంటే కార్ రిపేర్ అయింది.. కొత్త కారు కొనండి అంటూ సరదాగా సాగుతూ ఉంటుంది.. కార్ రిపేర్ కాదు మెకానిక్ ని తీసుకురావాలని డ్రైవర్ చెబుతాడు.. పిల్లలు సరే మేం నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను అంటారు. వాళ్ల తాతయ్య ఆపి ఎవరైనా వస్తే కారు కానీ బండి గాని ఎక్కించి పంపిస్తాను ఆగండి అంటాడు. అప్పుడు పిల్లలు కలెక్టర్ సార్ వస్తే బాగుండు అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య అటువైపు నుంచి వస్తూ ఉంటాడు. కారు ఆపి అడిగితే కార్ రిపేర్ అయింది అని తెలుసుకుని పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లి దింపుతాను అని చెబుతాడు.. కార్ లో కూర్చున్న పిల్లలు ఇలా మేము అనుకున్నాము లేదో అలా మీరు వచ్చారు సార్ అని చెబుతారు. దేవి ఆదిత్య ను ఆప్యాయంగా పట్టుకొని నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా వెంటనే నువ్వే గుర్తొస్తావు అని చెబుతుంది. ఆదిత్య మనసులో నాకు పిల్లలు లేని లోటును నీలో చూసుకోమని ఆ దేవుడే నిన్ను నాకు పరిచయం చేశాడేమో.. కానీ నేను నీ మీద ఎంత ప్రేమ చూపించిన నువ్వు నా సొంత బిడ్డవు కాదుగా.. అని అనుకుంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది..!! మరిన్ని వివరాలు తర్వాత భాగంలో చూద్దాం..!!