పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై… ఈ సినిమాల పేర్లు వినగానే కోలీవుడ్ టాప్ కాంబినేషన్ ధనుష్-వెట్రిమారన్ గుర్తొస్తుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కలయిక ఇప్పటి వరకూ ఫ్లాప్ అనేదే తెలియదు. ప్రేక్షకులని పలకరించిన ప్రతిసారీ కొత్తదనం చూపించడంలో సక్సస్ అయిన ధనుష్-వెట్రిమారన్ ఇప్పుడు నాలుగో సారి ‘అసురన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు.
ధనుష్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడంలో సిద్ధహస్తుడైన వెట్రిమారన్, అసురన్ సినిమాలో కూడా ధనుష్ ని ముందెన్నడూ చూడని లుక్ లో చూపించబోతున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ కోలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఒక పోస్టర్ లో ధనుష్ రగ్గడ్ లుక్ లో కుర్చీలో కూర్చోని ఉండగా మంజూ వారియర్, ధనుష్ పక్కన నిలబడి ఉంది.
నిజానికి ధనుష్ పక్కన మంజూ వారియర్ నటించడమేంటని విమర్శించిన వాళ్లందరూ ఈ పోస్టర్ చూసి సైలెంట్ అయిపోయారు. ఇక రెండో పోస్టర్ లో పంచకట్టి, బల్లెం పట్టి గాల్లోకి ఎగిరి శత్రువులని భయపెడుతున్నట్లు ఉంది. ధనుష్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్స్ సినిమాపై అంచనాలని పెంచుతున్నాయి. మరి ధనుష్-వెట్రి మారన్ తమ మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ మరో హిట్ ఇస్తారేమో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!