NTR 30: ఎన్టీఆర్ జన్మదినం ఈ నెల 20వ తారీకు నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల శివ అభిమానులను సర్ ప్రైజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. విషయంలోకి వెళితే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ చేసే ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో..”RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ రాజమౌళితో చేశాక… కొరటాల ప్రాజెక్ట్ నీ ఎన్టీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాస్తవానికి “RRR” తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తారని భావించారు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా ఆగిపోయింది. ఇదిలా ఉంటే కొరటాల శివ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ ఎన్టీఆర్ బర్త్ డే నాడు మే 20వ తారీకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్ వర్క్ పై కొరటాల ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. జూన్ నెల నుండి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొరటాల ఇటీవల ఆచార్య తో మొదటి సారి ఫ్లాప్ అందుకోవటం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా కొరటాల తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పైగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 4 కేజీల బరువు తగ్గినట్లు కూడా టాక్. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” సూపర్ హిట్ కావడంతో.. ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!