Ghani – Liger: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన సినిమా గని. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా అల్లు బాబి, సిద్దు ముద్ద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సాయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది. బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా రూపొందడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. అందుకు కారణం మెగా హీరోలలో కంప్లీట్ డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటున్న హీరో వరుణ్ తేజ్ కాబట్టి. తన ప్రతీ సినిమాకు చాలా వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు.
వరుణ్ హైట్‌కు బాక్సింగ్ కథాంశం బాగా సెట్ అయ్యేదే అని అందరూ సినిమా రిలీజ్‌కు ముందు మాట్లాడుకున్నారు. కానీ, తీరా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాతో గని చిత్రాన్ని పోల్చడంతో కూడా అంచనాలు అందరిలో బాగానే ఏర్పడ్డాయి. కానీ, అసలు ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధమే లేదని అభిమానులే కాదు అందరూ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా రిజల్ట్ కారణంగా ఇప్పుడు లైగర్ సినిమా మీద కూడా కొత్త టాక్ మొదలైంది.
Ghani – Liger: ఆల్రెడీ పూరి తీసిన కథే కదా..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇంతక ముందు మాస్ మహారాజ రవితేజ హీరోగా అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా వచ్చింది. ఇది కూడా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. బాక్సాఫిస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి పూరి-రవితేజలకు మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు అదే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియన్ రేంజ్లో. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇది కూడా బాక్సింగ్ నేపథ్యం కావడంతో కొత్తగా ఏం చెప్తారు..ఆల్రెడీ పూరి తీసిన కథే కదా అని సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. చూడాలి మరి లైగర్ రిలీజైయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!