ఎన్నికలు వస్తుందంటే.. సినిమా పరిశ్రమకు కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే అని చెప్పాలి. ఎందుకంటే.. అందరి ఆసక్తి రాజకీయాలపైనే ఉంటుంది. సినిమాల కలెక్షన్స్‌పై కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సమయంలో సినిమాలు పెద్దగా విడుదల కావు. మరి ఎన్నికల ప్రభావం చిన్న సినిమాలకేనా!.. స్టార్ హీరో సినిమాలకు ఉండవా! అంటే ఎవరికైనా ఉంటాయంటున్నాడు మన సూపర్‌స్టార్ రజనీకాంత్.
అసలు విషయమేమంటే..రజనీకాంత్, ఎ.ఆర్.మురగదాస్ కలయికలో సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్‌కి వెళ్లాలి. కానీ తమిళనాడులో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్నికల హడావుడిలో షూటింగ్‌లకు ఏమైనా మనుషుల కొరత ఏర్పడొచ్చు. దిగువ తరగతి సినిమా జనాలందరూ మీటింగ్‌లకు గట్రా వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలు ముగిసిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టుకుందామనుకుంటున్నాడట సూపర్‌స్టార్. ఏం చేద్దాం ఎన్నికలా.. మజాకా!!.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!