NewsOrbit
సినిమా

F3: `ఎఫ్ 3` స్పెషల్ సాంగ్‌.. వెంకీ, వ‌రుణ్‌ల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన పూజా హెగ్డే!

F3: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్‌. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ హైప్‌ను పెంచుతున్నారు. ఇక‌పోతే ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ స్పెష‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌దిలారు. `లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా ..` అంటూ సాగే ఈ పాట‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రాహుల్ సిప్లి గంజ్-గీతామాధురి ఆలపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే రాజు సుందరం కొరియో గ్రఫీని అందించారు.

స‌ర‌దాగా సాగే ఈ పార్టీ సాంగ్‌లో వెంకీ, వ‌రుణ్‌ల‌తో క‌లిసి పూజా హెగ్డే డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. వీరు ముగ్గురు వేసిన స్టెప్పులు పాట‌కే హైలెట్‌గా నిలిచాయి. మొత్తానికి ఇప్పుడీ స్పెష‌ల్ సాంగ్ యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ చిత్రంలో వెంకీ రేచీక‌టి ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తే.. వ‌రుణ్ న‌త్తి స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డే యువ‌కుడిగా చేశాడు.

author avatar
kavya N

Related posts

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar