Akkineni Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా “కస్టడీ” సినిమా చేయగా సరిగ్గా హిట్టు అందుకోలేకపోయాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన గాని “కస్టడీ” విజయం సాధించలేదు. దీంతో నాగచైతన్య ఎక్కువగా డిజిటల్ ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా “దూత” అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. త్వరలోనే “దూత” వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో “కార్తికేయ 2″తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో.. నాగచైతన్య ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉంది. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య “100% లవ్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి “తండేల్” అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. గుబురు గడ్డంతో బోటులో కూర్చుని ఉన్న నాగచైతన్య పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
ఆల్రెడీ గతంలో నాగచైతన్యతో సాయి పల్లవి “లవ్ స్టోరీ” అనే సినిమా చేయడం జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” ఘన విజయం సాధించింది. కాగా ఇప్పుడు “తండేల్” లో చాలా వైవిధ్యమైన పాత్రలలో చైతు సాయి పల్లవి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మత్స్యకారులకి సంబంధించిన కథతో నాగచైతన్య ఈ సినిమాలో మాస్ గా కనిపిస్తున్నారు. నవంబర్ 23వ తారీకు చైతన్య పుట్టినరోజు నేపథ్యంలో.. ఈ రకంగా కొత్త సినిమా టైటిల్ డైరెక్టర్ చందు మొండేటి.. గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ప్రకటించడం జరిగింది. దీంతో అక్కినేని అభిమానులు టైటిల్ చాలా కొత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!