హీరో మాధవన్ తన కుమారుడు వేదాంత్‌ను చూసి గర్వపడుతున్నాడు. సాధారణంగా సినిమా హీరోల తనయులు వారి తండ్రి అడుగుజాడల్లోనే నడవడాన్ని ఈరోజుల్లో మనం చూస్తున్నాం. అయితే మాధవన్ తనయుడు వేదాంత్ మాత్రం అందుకు తాను భిన్నం అని అంటున్నాడు. వేదాంత్ స్విమ్మింగ్‌లో రికార్డును క్రియేట్ చేశాడు. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ ఈత పోటీల్లో పాల్గొన కాంస్య పతకం అందుకున్నాడు. అయితే ఈ ఏడాది జాతీయస్థాయిలో ఈత పోటీల్లో వేదాంత్ మూడు బంగారు, ఓ వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. దేవుడు, మీ అందరి ఆశీర్వాదంతో తన కుమారుడు జాతీయ రికార్డ్ సాధించడం పట్ల మాధవన్ తన సంతోషాన్నిసోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశాడు.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!