Devara: “RRR” వంటి ప్రపంచ స్థాయి విజయం తర్వాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ కాలేదు. “RRR” విడుదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది. “RRR” తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ రకంగానే సినిమా షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతున్న క్రమంలో పరిస్థితులు మొత్తం తలకిందులు అయ్యాయి. మేటర్ లోకి వెళ్తే “దేవర” సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ కావటం జరిగింది. దీంతో సర్జరీ జరగడంతో ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కావాల్సిన సినిమా అక్టోబర్ నెలకి వాయిదా పడటం జరిగింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ మ్యూజియం అందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా సరికొత్త అప్డేట్ రివిల్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే.. “టిల్లు స్క్వేర్” సినిమాని నిర్మాత నాగ వంశీ ఎన్టీఆర్ కి ప్రత్యేక స్క్రీనింగ్ వేయడం జరిగిందట. ఈ కార్యక్రమంలో హీరో సిద్దు జొన్నలగడ్డతో పాటు విశ్వక్ కూడా పాల్గొనడం జరిగిందట. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సన్నిహితంగా దిగిన ఫోటో ఒకటి విశ్వక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “లవ్ యు తారక్ అన్న.. “దేవర” మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉందమ్మా. అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశారు.
ఈ ఆల్బమ్ అందరికీ నచ్చుతుంది.. అని పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ కి విశ్వక్ వీరాభిమాని కావటంతో… దేవర మ్యూజిక్ గురించి చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. “దేవర” మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేసినట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా దర్శకుడు కొరటాల శివతో 2016లో “జనతా గ్యారేజ్” అనే సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు “దేవర” చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!