Silence 2 OTT Release: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా రూపొందుతున్నాయి. ఇటువంటి సినిమాలు మరియు సిరీస్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడంతో డైరెక్టర్లు సైతం ఇటువంటి కథలనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు. తాజాగా ఇటువంటి జోనర్ లోనే మరో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జీ5 ఓటిటిలోకి అలాంటి మూవీ ని రాబోతుంది. గతంలో సైలెన్స్ పేరుతో వచ్చిన మూవీకి ఇప్పుడు సైలెన్స్ 2 ది వైట్ ఔల్ బార్ షూట్ అవుట్ పేరుతో సీక్వెల్ వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ను జీ5 ఓటిటి మంగళవారం అనగా ఏప్రియల్ రెండో తారీకు రాత్రి రిలీజ్ చేసింది.
అబన్ బరూచా డైరెక్ట్ చేసిన ఈ సైలెన్స్ 2 చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయీ, ప్రాచీ దేశాయి కలిసి నటించిన ఈ మూవీ జీ5 ఓటిటిలో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. జి స్టూడియోస్, కాండిడ్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సీక్వెల్ కూడా ఎంతో ఉత్కంఠ రేపేలా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సైలెన్స్ మూవీ లో ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్.. ఈ సీక్వెల్ ద్వారా మరోసారి అదే పాత్రలో కనిపించబోతున్నాడు. వరుస హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి అవినాష్ అండ్ టీం ఏం చేయబోతున్నారనేది ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్.
సైలెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వాళ్ళు ఈ సైలెన్స్ 2 మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు. ఈ మూవీలో సరిగ్గా మూడేళ్ల కిందట అంటే మార్చ్ 2021లో సైలెన్స్ మూవీ వచ్చింది. ఈ మూవీ ని కూడా అబన్ నే డైరెక్ట్ చేసింది. బాలీవుడ్ లో డియర్ జిందగీ, టీ స్పూన్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ఈమె ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మూడేళ్ల తరువాత సీక్వెల్ తో రాబోతుంది. సైలెన్స్ 2 ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తిగా ఉండడంతో ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. వైట్ ఔల్ అనే బార్ లో జరిగిన షూట్ అవుట్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.
దీనిని పరిష్కరించడానికి అవినాష్ అండ్ టీం రంగంలోకి దిగుతుంది. ఆ తరువాత క్రైమ్ సీన్ లో షూట్ అవుట్ జరిగిన విధాన్ని అవినాష్ వివరిస్తాడు. అందులో ఓ అమ్మాయిని ముందు నుంచి ఆ షూట్ అవుట్ ఎందుకు కాల్చాడన్న ప్రశ్న దగ్గర అతడు ఆగిపోతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు హత్య చేశారు? అనే పాయింట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఇక ఈ మూవీ ఓ టి టి ప్రేక్షకులని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకి ఎక్కువ ప్రేక్షక ఆదరణ దక్కడంతో ఈ సినిమా బాగానే పికప్ అవుతుందని అనిపిస్తుంది. మరి రిలీజ్ అనంతరం ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.