Chiranjeevi: ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు వరుసపెట్టి రీ-ఎంట్రీ లు ఇస్తున్నారు. 90 లలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా ముద్రపడిన చాలామంది ఇటీవల వెండితెరపై కనువిందు చేస్తూ ఉన్నారు. రమ్యకృష్ణ, మీనా, రాశి, స్నేహ, టాబు, నదియా, భూమిక, ఖుష్బూ, విజయశాంతి.. మరి కొంతమంది హీరోయిన్ లు ఇప్పటికే రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన హీరోయిన్ రంభ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఒక ప్రముఖ దర్శకుడు.. స్టార్ హీరో సినిమాలో.. రంభ కి కీలక పాత్ర రాసినట్లు ఆమె తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దక్షిణాది సినిమా రంగంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటించిన ఈమె హిందీలో కూడా పలు సినిమాలు చేయడం జరిగింది. రంభ తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడం జరిగింది. బావగారు బాగున్నారా, హిట్లర్, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు.
అయితే రంభ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆమె జన్మదినం నాడు జూన్ 5వ తారీకు తన భర్త పిల్లలతో కలిసి ఫోటోలు దిగడం జరిగింది. మొదటి ఫోటోలో కేకు తో పాటు ఒంటరిగా దిగిన రంభ ఆ తర్వాత ఫోటోలలో ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోటో దిగటం జరిగింది. 46వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న రంభ… బర్తడే విషెస్ చెప్పిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.