Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో అయినా గాని.. సినిమాలు చేయడంలో మాత్రం ఎవరికి అందని స్పీడ్ లో దూసుకుపోతున్నారు నందమూరి బాలయ్య బాబు. గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జూన్ పదవ తారీకు బాలయ్య పుట్టినరోజు కావడంతో సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిన్నపాటి వీడియో విడుదల చేసే ఆలోచనలో గోపీచంద్ మలినేని ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో బాలయ్య సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ గురించి అనిల్ రావిపూడి అంచనాలు పెరిగిపోయేటట్లు కామెంట్లు చేయడం జరిగింది. గతంలో ఎవరూ చూపించని రీతిలో తన సినిమాలో బాలయ్య బాబుని.. సరికొత్త రీతిలో చూపిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక ఈ సినిమాలో ఓ లేడి విలన్ పాత్ర హైలెట్ గా ఉండానున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. అయితే ఈ పాత్రని హీరోయిన్ అంజలితో చేయించే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ తరహాలో తనదైన ఎంటర్టైన్మెంట్ అందించే రీతిలో అనిల్ రావిపూడి.. ఈ సినిమా స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!