హాలీవుడ్ యాక్టర్ బిల్ డ్యూక్, దక్షిణాది సినిమాలపై ఆసక్తిని చూపుతున్నారు. ఇటీవల మహర్షి బావుందని, కుదిరితే మహేష్, వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు రజనీకాంత్ దర్బార్ గురించి ప్రస్తావించారు. “మురుగదాస్‌గారు, నాకు తమిళ్ తెలియదు. కానీ మీరు తెరకెక్కిస్తున్న `దర్బార్` చిత్రంలో నటించాలని అనుకుంటున్నాను. రజనీకాంత్ సోదరుడిగానో, నయనతార అంకుల్ పాత్రల్లోనైనా నటిస్తాను. అనిరుధ్ మాలాంటి స్టార్స్‌కి కూడా మంచి పాటల్ని కంపోజ్ చేయ్“ అన్నారు. దీనికి మురుగదాస్ `నిజంగా మీరేనా? సార్` అంటూ రిప్లై కూడా పెట్టారు.
previous post