NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 14 2024 Episode 178: ఆన్లైన్లో లోన్లు ఇస్తున్న వ్యక్తుల్ని పట్టుకున్న జగదాత్రి, జగదాత్రి కేదార్ ని పోలీసులు అనుకుంటున్న యువరాజ్..

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

Jagadhatri March 14 2024 Episode 178: నువ్వు ఈ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి వీడ్చగలిగితే నీ పుట్టుక గురించి ఇలా ఎగతాళి చేసే వాళ్లు కాదు అని జగదాత్రి అంటుంది.కేదార్ ఆ మాటలకి నవ్వుతాడు.ఏంటి కేదార్ నీకు గాని ఏమైనా పిచ్చి పట్టిందా నేనిలా అంటుంటే నవ్వుతావేంటి అని జగదాత్రి అంటుంది.నువ్వు బుజ్జి బుజ్జిగా తిడుతుంటే చాలా బాగుంది ధాత్రి అని కేదార్ అంటాడు.ఇంతలో కౌశికి అక్కడికి వస్తుంది.నన్ను క్షమించండి వదిన వాళ్లు కేదార్ ని అవమానించేసరికి ఆవేశంలో నోరు జారాను ఇంకెప్పుడూ అలా జరగదు అని జగదాత్రి అంటుంది.వాళ్లు అలా అన్నారని నువ్వు ఆవేశపడడం ఈ గొడవలన్నీ ఈ కుటుంబం చల్లాచెదురు అవ్వడానికి మూల కారణమవుతున్నాయి,జగదాత్రి కేదార్ మా బాబాయ్ కొడుకుని మీరు ఏ సాక్షాలు చూపించలేకపోయారు మీకు రెండు రోజులు మాత్రమే గడువుంది.

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights
Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

ఆ గడువు ముగిసే లోపు ఆధారాలు చూపిస్తే ఇంట్లో ఉంటారు లేదంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది మీ మీద ఉన్న అభిమానంతో ఇంట్లో ఉండనిస్తానని మాత్రం అనుకోకండి సాక్షాలు తెచ్చే ప్రయత్నం చేయండి అని కౌశికి వెళ్ళిపోతుంది.కేదార్ ఎలాగైనా సూరి మామను పట్టుకొని ఫొటోస్ కాకుండా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి అని జగదాత్రి అంటుంది.ఇంతలో సాదు సార్ ఫోన్ చేస్తాడు కేదార్ కి.జైహింద్ సార్ చెప్పండి అని జగదాత్రి అంటుంది.జెడి ఆన్లైన్లో లోన్ ఇచ్చే వాళ్లు అడ్రస్ దొరికింది అదంతా రెజిస్ట్రేషన్ ఏరియా అక్కడ జనాలు ఉంటారు వాళ్లకి ఎలాంటి డౌట్ రాకుండా వెళ్లి అరెస్టు చేయాలి అని చెబుతాడు.ఒకే సార్ వెంటనే వెళ్లి అతని పట్టుకుంటాం అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,ఆన్లైన్లో లోన్ ఇచ్చే వాళ్లు కస్టమర్లకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ల సార్ ఈరోజు నాకు ఎలాగైనా సరే పది లక్షలు వసూలు కావాలి మీరేం చేస్తారు నాకు తెలియదు అని అంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights
Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

ఇంతలో జగదాత్రి కేదార్ వాళ్ళ సార్ చెప్పిన ఏరియాకి వస్తారు. ఇదేంటి జగదాత్రి ఇక్కడ అంతా జనాలు తిరుగుతున్నారు ఇక్కడ అలాంటి ఆఫీస్ ఏమి లేదు కదా అని కేదార్ అంటాడు. చూద్దాం కేదార్ అంటూ ఇద్దరూ అక్కడ అంతా వెతుకుతారు కానీ ఏమి కనిపించకపోయేసరికి ఆలోచిస్తూ నిలబడతారు. అక్కడి నుంచి ఆన్లైన్లో మాట్లాడే వ్యక్తి ఒక బకెట్లో బీర్ బాటిల్స్ వేసుకుని చెత్తకుప్ప దగ్గరికి వెళ్తాడు. అది చూసి గమనించిన జగదాత్రి కేదార్ అందులో బీర్ బాటిల్ ఉన్నాయి ఒకవేళ మనం వెతుకుతున్న మనుషులు వీళ్ళేమో అని జగదాత్రి అంటుంది. ధాత్రి వాళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగి ఉండొచ్చు కదా అని కేదార్ అంటాడు. ఇక్కడ బీర్ బాటిల్ వేయొద్దని రోజు చెప్తున్నాను అలాగే వేస్తున్నావు తమ్ముడు అని ఒక అతను అంటాడు. అన్నా మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు డిన్నర్ చేసాం బీర్ బాటిల్ తాగాం ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అతనికి 100 రూపాయలు ఇస్తాడు ఆ వ్యక్తి. అది చూసిన జగదాత్రి కచ్చితంగా వీళ్ళు మనం వెతుకుతున్న వాళ్లే కేదార్ అని అతని ఫాలో అవుతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights
Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

ఏంటమ్మా నీ దగ్గర డబ్బులు లేవా అయితే నన్నేం చేయమంటావ్ అని ఆ రౌడీ అంటాడు. నాకు నెల రోజులు టైం ఇవ్వండి సార్ మీ డబ్బు కట్టేస్తాను అని ఆ అమ్మాయి అంటుంది. అయితే నువ్వు నాకు ఒక గంట టైం కేటాయించు అని అతను అంటాడు. మాది పరువుగళ్ల కుటుంబం సార్ అలా మాట్లాడతారు ఏంటి అని ఆ అమ్మాయి అంటుంది. నీది పరువు గల కుటుంబం అయితే డబ్బు కట్టమ్మా టైం అడిగావు మరి నేను టైం అడిగితే కోప్పడతావ్ ఏంటి అని అతను అంటాడు. ఇంతలో జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఏ మీరెవరు అని అతను అంటాడు.

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights
Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

నువ్వు మీ ఇంటికి వెల్లమ్మ అని జగదాత్రి అమ్మాయిని పంపించి చూడు బ్రదర్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా అమ్మాయిల్ని బెదిరించి ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు మీ వెనుక ఉన్నది ఎవరు అని జగదాత్రి అడుగుతుంది.ఒరేయ్ ఇన్ని రోజు మనల్ని వెతుక్కుంటూ మాములు వచ్చేవారు ఈరోజు మామ కూతురు వచ్చింది రా అని ఆ వ్యక్తి అంటాడు. జగదాత్రి అతని తలకి గన్ను గురిపెట్టి నేను మర్యాదగా అన్నయ్య అన్నాను నువ్వు మామ కూతురు అంటావ్ ఏంట్రా బొత్తిగా నీకు వరుసలు కూడా తెలియట్లేదా నీ వెనక ఉండి నడిపిస్తుంది ఎవరో చెప్పకపోతే నా గన్నులో ఉన్న బులెట్ ని తలలోకి దూసుకు వెళుతుంది చెప్పు అని జగదాత్రి అంటుంది. అతను భయపడిపోయి మీనన్ మా చేత ఇలా చేస్తున్నాడు మా సార్ మీనన్ అని చెబుతాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights
Jagadhatri Today Episode March 14 2024 Episode 178 highlights

ఇంతలో మీడియా పోలీసులు అక్కడికి వస్తారు. ఇలా ఆన్లైన్లో లోన్లు ఇచ్చి కుటుంబాలని బెదిరించి ఆత్మహత్యలకు దారితీస్తున్న వాళ్లని పట్టుకున్నారు వీరిపై మీ స్పందన ఏంటి మేడం అని ఒక మీడియా అమ్మాయి అడుగుతుంది. అందరికీ చెప్పదలిసేది ఒక్కటే మన అవసరమే మనకు శత్రువు మన అవసరాన్ని తీర్చుకోవడానికి అప్పు కోసం వెళ్తాం అప్పుడు ఇలాంటి వాళ్లు అవకాశం ఇచ్చి డబ్బులు ఇస్తామంటారు కానీ ఎలాంటి తాకట్టు లేకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నారని ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి ఘోరాలు నేరాలు జరగవు ఈ వీడియో తరఫున మీకందరికీ చెప్తున్నది ఒకటే అప్పు తీర్చడం కోసం లోను తీర్చుకోవాలని అనుకోకండి మీ కుటుంబాలని పాడు చేసుకోకండి అని జగదాత్రి చెబుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే సమస్యలకు భయపడకండి ఎదురు తిరగండి ఇదంతా ఎవరు నడిపిస్తున్నారో తెలిసిపోయింది ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్లందరినీ వ్యక్తికి పట్టుకుంటాను సమయం వచ్చినప్పుడు వాళ్ళ ముందుకి వస్తాను అప్పుడు వాళ్ల చేతులకి బేడీలు వేస్తాను అని జగదాత్రి అంటుంది. పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. కట్ చేస్తే,

టీవీలో న్యూస్ చూసి కేదారి జగదాత్రి లా ఉన్నారే అంటే భాయ్ మనుషుల్లేనా వీళ్ళు పట్టుకున్నది అని టీవీలో వస్తున్న కేదారి జగదాత్రని ఫోటో దించుతాడు యువరాజ్. వీళ్లు పోలీసులు అనే అనుకునే లోపే సాక్షులు దొరికినట్టే దొరుకుతాయి కానీ తప్పించుకుంటారు ఈరోజు ఎలాగైనా పట్టుకోవాల్సిందే అసలు ముందు వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని యువరాజ్ బూచి ని జగదాత్రి కేదార్ ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఇప్పటిదాకా అన్నా జోబ్ లోనే ఉన్నారు బామ్మర్ది ఎప్పుడు వెళ్లిపోయారో తెలియదు లేకపోతే ఏంటి బామ్మర్ది వాళ్ళు ఎక్కడున్నారో నాకేం తెలుసు వాళ్లు స్కూల్లో ఏదో పని ఉందని ఫోన్ వస్తే వెళ్ళిపోయారు అని బూచి అంటాడు. వాళ్ళెల్లి ఎంత టైం అవుతుంది అని యువరాజ్ అంటాడు. టైం తెలియదు బామ్మర్ది కానీ వెళ్లారు అని బూచి వెళ్లిపోతాడు. ఈరోజు వాళ్ళు పోలీసుల కాదు తేల్చుకుంటాను అని యువరాజ్ అనుకుంటాడు..

Related posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N