NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Joshua OTT Release: కొందరు డైరెక్షన్లో ఒక్కోసారి విఫలమవుతూ ఉంటారు. మరికొన్ని సమయాలలో సక్సెస్ అవుతూ కూడా ఉంటారు. అలా ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ మీనన్ బ్యాడ్ టైం నడుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం వరుస అట్టర్ ప్లాప్ లను వెలుగు చూస్తున్నాడు. ఘర్షణ, ఏ మాయ చేసావే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వంటి విజయవంతమైన సినిమాల తో సక్సెస్ అయిన ఈయన బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నాడు. 2015లో రిలీజ్ అయిన అజిత్ ఎన్నై అరిందాల్ అనంతరం గౌతమ్ మీనన్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ తరువాత అతడు చేసిన సినిమాలేవి బాక్స్ ఆఫీస్ లో పెద్దగా నిలవలేకపోయాయి.

Joshua OTT Release updates
Joshua OTT Release updates

విక్రమ్తో అతడు చేసిన ధృవనక్షత్రం షూటింగ్ పూర్తయి ఐదేళ్లు గడిచిన ఇప్పటికి రిలీజ్ కు నోచుకోలేదు. తాజాగా అతడు దర్శకత్వం వహించిన తమిళ్ లో బడ్జెట్ మూవీ జాషువా కూడా డిజాస్టర్ అయింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మార్చ్ ఒకటిన థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీలో వరుణ్ మరియు రాహి హీరో, హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ సీక్వెళ్ళు బాగున్నా కథా, నటనలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేక పోయింది. ఇక థియేటర్లో రిలీజ్ అయ్యి నెల కూడా గడవక ముందే ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. గురువారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జాషువా ఓ కాంట్రాక్ట్ కిల్లర్. కుందవి అనే ఎన్ఆర్ఐ లాయర్ కు బాడీగార్డ్ గా పనిచేసే డీన్ ను కుదుర్చుకుంటాడు జాషువా. మెక్సికెన్ డ్రగ్ గ్యాంగ్ కుందనిని టార్గెట్ చేస్తుంది. ఆ గ్యాంగ్ బారీ నుంచి కుంతవీని జాషువా ఎలా కాపాడతాడు? జాషువాకు కుందికి ఇదివరకే పరిచయం ఉందా? అనే సంఘటనల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. నిజానికి ఈ మూవీని 2019లోనే అనౌన్స్ చేశాడు గౌతమ్‌. ఇక అనంతరం కోవిడ్ తో పాటు ఇతర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇక అన్ని అడ్డంకులు తప్పించుకుని మార్చి 1న ఈ మూవీ రిలీజ్ అయింది.

Joshua OTT Release updates
Joshua OTT Release updates

కానీ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ డిజాస్టర్ మూవీ కాస్త ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. మరి ఈ మూవీ ఓటిటిలో ఆయిన రెస్పాన్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఓటిటిలో కూడా ఈ మూవీ మంచు రెస్పాన్స్ దక్కించుకోకపోతే గౌతమ్ మీనన్ కొంతకాలం పాటు డైరెక్షన్ కి గ్యాప్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు. వరుస డిజాస్టర్ లతో ఉన్న ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరోలు కూడా ఇష్టపడడం లేదు. కనుక కొంతకాలం గ్యాప్ ఇచ్చి మంచి కథను రూపొందించి సూపర్ హిట్ విజయం కొడితే మరోసారి ఫామ్ లోకి వస్తాడు గౌతమ్ మీనన్.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri