Vishal: హీరో విశాల్ అందరికీ సుపరిచితుడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వాసి అయినా గాని తమిళ సినిమా రంగంలో తిరుగులేని హీరోగా స్థిరపడ్డాడు. హీరోగా అనేక సినిమాలు చేస్తూ మరోపక్క… చాలామందికి సహాయాలు చేస్తూ… తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తమిళ నిర్మాణ మండలి అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో విశాల్ తీసుకున్న చాలా నిర్ణయాలు సంచలనాలు సృష్టించాయి. ఎంతో పేరు తమిళ సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ కూడా విశాల్ ఇతరులకు సహాయపడటంలో ఎప్పుడూ ముందుంటాడు. సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయ్యాడో అదే రీతిలో మనిషి పరంగా కూడా దానికి డబల్ గా తోటి వారికి సమాజానికి ఉపయోగపడ్డాడు.
తెలుగు చలనచిత్ర రంగంలో పందెంకోడి సినిమాతో మొట్టమొదటి విజయాన్ని సాధించి… ఇక్కడ కూడా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. తమిళ సినిమా రంగానికి చెందిన సూర్య, విక్రం, విజయ్ సినిమాలకు పోటీగా తీటుగా విశాల్ సినిమాలు కూడా తెలుగులో ఆడుతుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశాల్ “మార్క్ ఆంటోనీ” అనే సినిమా చేస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల భారీ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం గురించి హీరో విశాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “జస్ట్ కొన్ని సెకన్లు, కొన్ని అంగుళాల దూరంలో… నా చావు కనిపించింది. థాంక్యూ గాడ్. ఈ ఘటన తర్వాత మళ్లీ యధావిధిగా షూటింగ్ లో జాయిన్ అయ్యాను అని విశాల్ స్పష్టం చేశారు. ఈ వీడియో చూసి విశాల అభిమానులు కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో జాగ్రత్తగా ఉండు విశాల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!