Kalki 2898 AD: టాలీవుడ్ ని తన ఫాలోయింగ్ తో షేక్ చేస్తున్న హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి నాటి నుంచి మొన్న రిలీజ్ అయిన సలార్ వరకు మొత్తం తన హవానే నడుస్తుంది. సంవత్సరం మొత్తంలో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తు.. తక్కువ మాట్లాడుతూ తన సత్తా నిరూపించుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ నాలుగు పాన్ ఇండియా సినిమాలు దాకా ఉన్నాయి. ఇక ఈ సినిమాలపై భారీ అంచనాలు సైతం నెలకొన్నాయి. ఈ సినిమాల్లో ముఖ్యంగా ప్రేక్షకులు
ఎంతగానో ఎదురుచూసే మూవీ కల్కి. కల్కి మూవీ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని నాగశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ ని ప్రొడ్యూసర్ సి అశ్విని దట్ వైజయంతి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుపై తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. కల్కి మూవీకి బ్రేక్ పడినట్లు సమాచారం. కల్కి మూవీ కి ఎందుకు బ్రేక్ పడింది? అసలు రీసజ్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేకర్స్ కల్కి మూవీ ని మే 9.. 2024లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి ఓ ముప్పు వచ్చి పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకొనే వల్లే ఇది వచ్చినట్లు తెలుస్తుంది. నేడు అనగా ఫిబ్రవరి 29న దీపికా పదుకొనే ఓ పోస్టర్ ద్వారా తాను తల్లి అవుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక బేబీ బంప్ తో ఉన్న దీపిక పదుకొనే కి షూటింగ్ చేయడం అసాధ్యం. తను చేయాలనుకున్న ఆ సినిమాకి తనను హీరోయిన్గా పెట్టి పూర్తి సినిమా కంప్లీట్ చేయడం అనేది అసాధ్యం. అలా అని బేబీ బంప్ తో కవర్ చేసి సినిమా షూటింగ్ ని ముగించలేరు. ఇప్పటికే దాదాపు షూట్ కంప్లీట్ అయింది. కానీ కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. మరి ఆ సన్నివేశాలను తెరకెక్కించాలంటే దీపికా పదుకొనే ఉండాలి. ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అవ్వడంతో కల్కి మూవీకి ముప్పు వచ్చింది. మరి వాటిని కవర్ చేసి చెప్పిన టైం కి రిలీజ్ చేస్తారో లేదా డేట్ ని వాయిదా వేస్తారో చూడాలి మరి..!
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!