`పి.ఎస్.వి.గరుడవేగ` తర్వాత డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం `కల్కి`. ఈ చిత్రంలో రాజశేఖర్ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. ఆదాశర్మ హీరోయిన్. `అ!` ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ను నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. భగవద్గీతలో కర్మ గురించి శ్రీకృష్ణుడు, అర్జునుడితో చెప్పిన శ్లోకంతో ట్రైలర్ మొదలైంది. ఏం సెప్తిరి సెప్తిరి అనే డైలాగ్తో పాటు ట్రైలర్లో చివరల్లో రాజశేఖర్ తనపై తనే సెటైర్ వేసుకోవడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతి సన్నివేశాన్ని ప్రశాంత్ వర్మ ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు కనపడుతోంది. సి.కల్యాణ్ నిర్మాత. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!