Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “దేవర” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో జాన్వి కపూర్ కి సంబంధించి లంగా వోణిలో పల్లెటూరి పడుచుల కనిపిస్తున్న లేటెస్ట్ స్టిల్ “దేవర” సినిమా యూనిట్ విడుదల చేయడం జరిగింది. అచ్చం గ్రామానికి చెందిన అమ్మాయి మాదిరిగా.. జాన్వీ కపూర్ కనిపిస్తోంది. తంగం పాత్రలో నటిస్తోంది.
ఈ క్రమంలో సినిమా యూనిట్ ఇదిగో మా తంగం అంటూ.. సినిమా యూనిట్ ఫోటో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం “దేవర” సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. “దేవర” సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే గతంలో రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసిన తర్వాత తారక్ మళ్లీ హిట్ కొట్టడానికి తల ప్రాణం తోకకు వచ్చే పరిస్థితి నెలకొంది. “సింహాద్రి”, “యమదొంగ” సినిమాల తర్వాత మళ్లీ హిట్ కొట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఈ క్రమంలో “RRR” తర్వాత చేస్తున్న సినిమా కావటంతో “దేవర” సినిమా షూటింగ్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క వరుస విజయాలతో దూసుకుపోయిన కొరటాల “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ తర్వాత.. చేస్తున్న సినిమా కావటంతో ప్రతి సీన్ స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!