NewsOrbit
సినిమా

Mahesh Babu: `క‌ళావ‌తి`తో మ‌హేష్ మ‌రో రికార్డ్‌.. ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్‌లో ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల ఫ‌స్ట్ సింగిల్‌ `క‌ళావ‌తి` బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను యంగ్ సెన్సేషన్‌ సిద్‌ శ్రీరామ్‌ అలపించారు. తమన్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఫిబ్ర‌వ‌రి 13న ఈ సాంగ్ బ‌య‌ట‌కు రాగా.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసి న‌యా రికార్డుల‌ను సెట్ చేసింది. ఇక తాజాగా `క‌ళావ‌తి` సాంగ్‌తో మ‌హేష్ మ‌రో అదిరిపోయే రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ క్లాస్ సాంగ్‌కి 22 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అలాగే మ‌రోవైపు 1 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతుంది.

దీంతో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ సాధించిన సాంగ్ గా `క‌ళావ‌తి` ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచి రికార్డుకెక్కింది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం వేస‌వి కానుక‌గా మే 12న విడుద‌ల కానుంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri