సూపర్‌స్టార్ మహేష్ దక్షిణాఫ్రికా వెళ్లబోతున్నాడు. అదేంటి రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో మహర్షిని వదిలేసి దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్లడం అని అనుకుంటున్నారా? కమర్షియల్ యాడ్ కోసం. ఇంతకు మహేష్‌ను దక్షిణాఫ్రికాకు వెళ్లేలా చేస్తున్న కమర్షియల్ యాడ్ ఏంటో తెలుసా? థమ్స్ అప్ యాడ్. దక్షిణాది హీరోల్లో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేసే హీరోల్లో మహేష్ ఒకరు. ఆయన చేస్తున్న ఈ థమ్స్ అప్ యాడ్.. సమ్మర్ సందర్భంగా కొత్త వెర్షన్‌ను షూట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఐదు రోజుల్లో థమ్స్ యాడ్‌ను పూర్తి చేసేసి హైదరాబాద్ చేరుకుని చేయాల్సిన రెండు పాటలను కూడా పూర్తి చేసేస్తాడట. ఏప్రిల్ అంతా మహర్షి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో, మే నెల ప్రథమార్థం అంతా ప్రమోషన్స్‌తో సరిపోతుంది. సమ్మర్ ట్రిప్ తర్వాత ఇక మహేష్ అనీల్ రావిపూడి సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!