NewsOrbit
సినిమా

కనికట్టు చేసిన ‘జల్లికట్టు’.. అందుకే ఆస్కార్ బరిలో..!

malayalam movie jallikattu into oscar race

దక్షిణాదిలో భాషా సినిమాల్లో కమర్షియల్ స్లాట్ కు మాత్రమే వర్కౌటయ్యేది తెలుగు సినిమాల్లోనే. కానీ.. తమిళ, మళయాళ, కన్నడ సినిమాల్లో కమర్షియల్ తోపాటు కథ, ఆర్ట్, క్లాస్, ట్రాజెడీ.. కథాంశాలు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ప్రేక్షకాదరణ కూడా ఎక్కువే. ముఖ్యంగా కథ, కథనంలో వారు పెట్టే దృష్టి ఆశ్చర్యం కలిగిస్తాయి. అందుకే.. జాతీయ, అంతర్జాతీయ, సీనీ.. అవార్డులకు ఎక్కువగా ఆ భాషల సినిమాలే దక్కించుకుంటాయి. 2019లో మళయాళంలో  ఆ తరహాలో వచ్చిన సినిమానే ‘జల్లికట్టు’. ఎద్దుల పోటీల నేపథ్యాన్ని కాస్త భిన్నంగా తీసుకుని మళయాళంలో తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా భారత్ తరపున అస్కార్ నామినేషన్ లో నిలవడం విశేషం

malayalam movie jallikattu into oscar race
malayalam movie jallikattu into oscar race

లిజో జోస్ పెల్లిస్సరీ దర్శకత్వంలో అంటోనీ వర్గీస్ హీరోగా నటించిన ఈ సినిమాలో కథ, కథనం ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలోని ఊళ్లో బీఫ్ సరాఫరా చేస్తాడు హీరో. దానికోసం ఊరి జనం ఎదురుచూస్తూ ఉంటారు. ఓసారి ఓ అడవి దున్నను తీసుకొచ్చి నరికే సమయంలో తన పశుబలంతో తప్పించుకుంటుంది. ఊరిపై పడి పదునైన కొమ్ములతో ప్రజలను వణికిస్తూ పంట, ఆస్తి నష్టం కలుగజేస్తుంది. దీంతో ఊరంతా అడవి దున్నను పట్టుకోవడంలో నిమగ్నమైపోతారు. పూర్తిగా అటవీ నేపథ్యం, రాత్రివేళల్లో చిత్రీకరణ, పశువును పట్టుకునే క్రమంలో ప్రజల ప్రవర్తన.. వంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆదిమానవవుల కాలంలో ఉన్నామా అనే ఓరకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతుంది. దీంతో అద్భుత విజయం సాధించి విమర్శకలు ప్రశంసలు అందుకుంది.

‘జల్లికట్టు’ను ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. దేశంలోని 27 సినిమాలు పోటీలో నిలవగా ఈ సినిమాను ఎంపిక చేసింది. ఇప్పటికే టొరంటో, బూసన్ ఫిల్స్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది. దేశీయంగా పలు అవార్డులు దక్కాయి. ఇటువంటి కథాంశాన్ని తెరకెక్కించడం కష్టమైన విషయమే. కానీ.. అనుకున్నది తెరపై తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇండియా నుంచి ఇప్పటివరకూ ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపికైన మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ చిత్రాల సరసన ‘జల్లికట్ట’ చేరింది. ఆస్కార్ వేదికపై ఉత్తమ విదేశీ చిత్రంగా ఉన్న కేటగిరీ.. గత ఏడాది నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మారింది. మరి ‘జల్లికట్టు’ ఏం చేస్తుందో.!

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri