NBK 107: `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని `క్రాక్`తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇది 107వ చిత్రం. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
`ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను ఫినిష్ చేసుకుంది. అలాగే సెకెండ్ షెడ్యూల్‌ను కూడా మేకర్స్ షురూ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ ఎన్బీకే 107తో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఉన్నట్టుండి ఈ ప్రచారం మొదలవ్వడానికి కారణం లేకపోలేదు. తాజాగా మోక్షజ్ఞ తన ట్విట్టర్ ఖాతాలో `నైట్ షూట్ #NBK107` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఆయన ఎందుకు చేశాడో సరైన స్పష్టత లేకపోయినా.. సినీ పరిశ్రమలో మాత్రం మరో చర్చకు దారి తీసింది. బాలయ్య 107 సినిమాతోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని, అందులో అతడు ఏదో కీ రోల్ పోషిస్తున్నాడు, అతడి ట్వీట్‌కు అర్థం కూడా అదే అని జోరుగా టాక్ నడుస్తోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. అలాగే ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!