NewsOrbit
రివ్యూలు సినిమా

సినిమా రివ్యూ : కీర్తి సురేష్ ‘పెంగ్విన్’

కరోనా లాక్ డౌన్ దెబ్బకు చాలా సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి ప్లాట్ఫామ్స్ లోనే విడుదల అయిపోయాయి. ఇక కోలీవుడ్ నుండి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ కూడా ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో  కొద్ది గంటల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఇక దాదాపు వంద రోజుల నుండి థియేటర్లు లేక పిచ్చెక్కిపోయిన సినీ జనాలు ఈ సినిమా కోసం బాగా ఎదురు చూశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? దీనికి కథ ఏమిటి? ఒకసారి చూద్దాం.

Penguin Movie Review | Thandoratimes.com |

కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రోమోస్ తో ఓటిటి వేదికగా విడుదలను అనౌన్స్ చేసినప్పటి నుండి అభిమానులలో చాలా ఆసక్తిని రేపింది ఈ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ కు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.

ఇక కథ విషయానికి వస్తే ఆరేళ్ల తర్వాత కూడా తన కొడుకుని పోగొట్టుకున్న జ్ఞాపకం రిథమ్‌ని (కీర్తి సురేష్) ని వెంటాడుతూ ఉంటుంది. తన భర్తతో విడిపోయి మరొక వివాహం చేసుకున్న రిథమ్ ఏడు నెలల గర్భవతి. తరచూ తన కొడుకు కనిపించకుండా పోయిన సరస్సు దగ్గరకు వెళ్లి అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమెకు ఉన్నఫలంగా అద్భుతమైన రీతిలో తన కొడుకు దొరుకుతాడు. కానీ అతను ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అసలు ఆ పిల్లాడిని ఎవరు తీసుకుని వెళ్లారు? అసలు ఎందుకు తీసుకొనివెళ్ళారు? మరల అతను ఎలా తిరిగి వచ్చాడు అన్న ప్రశ్నలు ఆమెను తొలిచేస్తుంటాయి. ఈ లోపల కనిపించకుండా పోయిన మరో పాప ఆచూకి తెలిసే క్రమంలో ఆమెకు ఎవరు ఎదురు పడతారు…. అసలు ఇన్నిరోజులు రిథమ్ కు అంతటి క్షోభను కలిగించింది ఎవరు? ఇది స్టోరీ యొక్క సారాంశం.

ఇకపోతే పెంగ్విన్ సినిమాలో అన్నింటికన్నా హైలెట్ విజువల్స్. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ టెన్షన్ పెంపొందిస్తూ ఉత్సుకత క్రియేట్ చేయడంలో స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే. మొదటి సన్నివేశంలోనే ఈ చిత్రం వీక్షకులను అరెస్ట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో తర్వాత మాట్లాడుకోవలసింది అద్భుతమైన లైటింగ్ గురించి. రెడ్, బ్లూ లాంటి వైబ్రెంట్ కలర్స్ తో టెన్షన్ క్రియేట్ చేయడంతో జనాలను స్టోరీ కట్టిపడేస్తుంది. ప్రథమార్థంలో అయితే ఉత్కంఠభరిత సన్నివేశాలు, సంఘటనలు చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ ‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్’ అవుతుందని అన్న భావనను మనకు కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ షాక్ తో సినిమాకు మంచి హైప్ వస్తుంది. ఆ తర్వాత అదే ఫ్లో ను కొనసాగించడంలో ఈశ్వర్ కొద్దిగా ఇబ్బంది పడి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాడు.

ఇక దర్శకుడు మొదటి నుండి ఏమి ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాడో ప్రేక్షకుడికి ఈజీగా అర్థం అయిపోతుంది. తన పిల్లాడు ఎలా తప్పిపోయాడు అనే ప్రశ్నకి రిథమ్ సమాధానాలు వెతుక్కునే క్రమంలో మాజీ భర్త మరియు ప్రస్తుత భర్త పై అనుమానం కలిగించేలా దర్శకుడు ప్రయత్నిస్తాడు కానీ వాటి వల్ల కథకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక పిల్లల్ని ఎత్తుకెళ్లి దారుణంగా చంపేసిన సైకో ఆచూకీ తెలుసుకునేందుకు తీసిన సన్నివేశాలు… పోలీస్ ఇంటరాగేషన్ లో ముఖాముఖి సన్నివేశాలు వంటివి అంతకు ముందు సినిమాల్లో చూసినవే. ఒక సుదీర్ఘంగా సాగే వారిద్దరి ప్రశ్నల గేమ్ అయితే చాలా పాయింట్‌లెస్‌గా, ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది.

ఇకపోతే ఏ థ్రిల్లర్ సినిమా అయినా తప్పు చేసిన వ్యక్తి లేదా సైకో యొక్క అతని మోటో (అలా చేసేందుకు అతనిని ప్రేరీపించిన కారణం, దాని వల్ల అతనికి వచ్చే లాభం) ఎంత లాజికల్ గా ఉంటే సినిమా కు అంత ఎక్కువ మార్కులు పడతాయి. అయితే అప్పటివరకు ఆసక్తిగా ఎదురు చూసిన అన్ని ప్రశ్నలకు ప్రేక్షకులకు కన్విన్స్ కాని  సమాధానాలు వచ్చాయి అంటే మాత్రం ఇంత సేపు క్రియేట్ చేసిన టెన్షన్ ప్రేక్షకులను కట్టిపడేసిన వైనం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే పిజ్జా లాంటి షాకింగ్ క్లైమాక్స్ ఉన్న అద్భుతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజు ఇటువంటి ఒక కథను యాక్సెప్ట్ చేసి ఫండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు పాటించడం…. కీర్తిసురేష్ అద్భుతమైన పర్ఫామెన్స్ కి స్టోరీ మరికొద్దిగా రీజనబుల్ గా పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.

రేటింగ్ : 2.75/5

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu