NewsOrbit
సినిమా

SVP: సర్కారు వారి పాటపై మైత్రీ మేకర్స్ పాజిటీవ్ పబ్లిసిటీ..?!

SVP:సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన తాజా చిత్రం​ ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. అయితే మొదటి రోజు ఈ సినిమా మీద విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చింది. డిజాస్టర్ అయిందంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అయితే సినిమా మీద విపరీతమైన నెగెటివిటీని ప్రచారం చేసినా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. వీకెండ్‌లో మరింతగా పుంజుకుంది. ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ చెప్పుకొచ్చింది.

Mythri Movie Makers positive publicity on svp song
Mythri Movie Makers positive publicity on svp song

SVP: నెగిటివిటీ ప్రచారానికి మైత్రీ మేకర్స్ బ్రేక్..

సోషల్ మీడియాలో ‘బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట’ హ్యాష్ ట్యాగ్ తో జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు వెంటనే సినిమా విడుదల అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరియు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకు వచ్చి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌లో బుకింగ్స్ జోరు చూడండి అంటూ నెగెటివ్ ట్రెండ్ చేసిన వారికి పరోక్షంగా చురకలు అంటించింది మైత్రీ మూవీస్. సర్కారు వారి పాట షోలు ఇంకా పడకముందే నెగెటివ్ ట్రెండ్స్‌లు, మీమ్స్, ట్రోల్స్ చేశారు.. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే స్థాయికి సినిమా వచ్చింది.. సినిమా మూడో రోజు ఫస్ట్, సెకండ్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి.. సూపర్ స్టార్ స్వాగ్ సీజన్‌ను ఎంజాయ్ చేయండి.. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని మైత్రీ ట్వీట్ వేసింది. సర్కారు వారి పాట సినిమాకు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాల్లో నెగటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో అది హైలైట్ అవ్వకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ప్రయత్నాలు చేసి ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం కాకుండా చూసింది.

Mythri Movie Makers positive publicity on svp song
Mythri Movie Makers positive publicity on svp song

ఖర్చు చేసి పాజిటీవ్ పబ్లిసిటీ..!?

మైత్రి మూవీ మేకర్స్ వారు సర్కారు వారి పాట సినిమాను డిఫైన్ చేసుకున్న విధానం పై అందరు చర్చించుకుంటున్న సమయంలో మరి కొందరు మాత్రం ఆ విషయాన్ని బూతద్దంలో పెట్టి విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఒక స్టార్ హీరో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సమయంలో ఆ సినిమా డిజాస్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా కోసం నిర్మాతలు చాలా ఖర్చు చేసి మరీ పాజిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినబడుతుంది. దీనికి మైత్రి మూవీస్ వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri