Junior NTR: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరో, హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తు ఉన్నారు. కానీ దశాబ్దాల నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కుటుంబాలలో నందమూరి కుటుంబం ఒకటి. ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలయ్య మరియు హరికృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. హటాత్తు పరిణామం ద్వారా హరికృష్ణ మరణించడంతో ఆయన సినీ ప్రస్థానం ముగిసింది.
ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ .. జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి తన ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా.. తన ఓన్ టాలెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక బాలయ్య అనంతరం నందమూరి ఫ్యామిలీని నిలబెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. కొన్ని రోజుల నుంచి నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారట. తారక్‌కు, నందమూరి, నారా ఫ్యామిలీ లకి కొన్ని రోజుల నుంచి గొడవలు కూడా జరుగుతున్నాయట. కావాలని వారు తారక్ ను దూరం పెడుతున్నారని సమాచారం.
అయితే దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడమే అట. జూనియర్ ఎన్టీఆర్ కనుక ప్రచారానికి వస్తే ఓట్లు ఎక్కువ పడతాయని ఆలోచించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ను ప్రచారానికి రమ్మంటే తారక్ ను చెప్పాడట. ఇక దీంతో అప్పటినుంచి బాలయ్య, చంద్రబాబు.. తారక్ ను దూరం పెట్టారట. అంతేకాకుండా ఆ గొడవలు కారణంగానే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాడని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!