నేచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `నాని గ్యాంగ్ లీడర్`తో బిజీగా ఉన్నాడు. మరోపక్క తన 25వ చిత్రం `వి` షూటింగ్లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్‌లో ఉన్నాయి. అంత వరకు ఓకే. అయితే ఇవి కాకుండా మరో రెండు సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడని, అందులో ఒకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఉంటుందని ఈమధ్య వార్తలు వినిపించాయి. అయితే ఇదే విషయాన్ని అభిమానులు ట్విట్టర్లో అడిగినప్పుడు నాని తనదైన స్టైల్లో స్పందించాడు. `ఫాల్స్ న్యూస్ మై డియర్ బాయ్స్` అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చాడు నాని. దీంతో నాని.. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో తన సినిమా ఉంటుందనే వార్తలకు చెక్ పెట్టేసినట్టే మరి.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!