నాని హీరోగా విడుదలైన`జెర్సీ` ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా పబ్లిసిటీ టైమ్‌లో పలువురు ఆయన నిర్మాణం గురించి అడిగారు. గతంలో `అ!` సినిమాను నిర్మించారు నాని. ఆ సినిమా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టలేదు. దాంతో ఇక నాని ప్రొడక్షన్లో అడుగుపెట్టరేమోనని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మళ్లీ ఆయన ప్రొడక్షన్ చేస్తున్నారు. అదీ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి. అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్తుతో కలిసి ఆయన మరో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తారు. అనుదీప్ దర్శకత్వం వహిస్తారు. అనుదీప్ పేరు వినగానే ఎవరికైనా `పిట్టగోడ` సినిమా గుర్తుకొస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ ఇది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. నాని, స్వప్న దత్ కలిసి నిర్మిస్తారు. నవీన్ పోలిశెట్టికి ఇది కొత్త చిత్రమేం కాదు. గతంలోనూ ఆయన చాలా సినిమాలే చేశారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
previous post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!