HI NANNA Official Trailer: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా “హాయ్ నాన్న” సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలయ్యింది. నాని కెరియర్ లో 30వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించారు. లవ్.. యాక్షన్.. ఎమోషనల్ నేపథ్యంలో సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్.. సంగీతం అందించడం జరిగింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మించడం జరిగింది. నానికి జోడిగా “సీతారామమ్” ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్.. ఫోటోలు వీడియోలు సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా హృదయాలను తాకుతూ ఉంది. తండ్రి..కూతురు నేపథ్యంలో ఎమోషనల్ లవ్ ఎంటర్టైన్మెంట్ తరహాలో “హాయ్ నాన్న” సినిమా చేయటం జరిగింది. ట్రైలర్ లో ఎమోషనల్ అంశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్రెష్ విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాని స్క్రీన్ ప్రజన్స్..మరియు నటన.. డైలాగ్స్ హృదయాన్ని తాకుతున్నాయి. మృణాల్ ఠాకూర్.. విజువల్స్ మరియు నటన కూడా ట్రైలర్ లో అద్భుతంగా ఉన్నాయి.
దాదాపు రెండు నిమిషాల 40 సెకండ్స్ కలిగిన ఈ ట్రైలర్..లో తండ్రి కూతురు మధ్య బాండింగ్ తెలియజేస్తూ.. ఎమోషనల్ గా నాని యొక్క స్ట్రగుల్ చూపించడం జరిగింది. ట్రైలర్ బట్టి చూస్తే కచ్చితంగా నాని కెరియర్ లో “హాయ్ నాన్న” సినిమా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో “దసరా” సినిమాతో నాని అదిరిపోయే హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమాని కూడా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మరో నూతన దర్శకుడు శౌర్యవ్… నాని కెరియర్ లో 30వ సినిమా “హాయ్ నాన్న” చేయటం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖున.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!