Pawan Kalyan: “ఒక లైలా కోసం” అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పూజా హెగ్డే అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ కావటం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన పూజా హెగ్డే అవకాశాలు అందుకోవడం జరిగింది. ఒక టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే కి మంచి అవకాశాలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో వరుసపెట్టి బ్లాక్ బస్టర్ లు పూజా హెగ్డే కి పడ్డాయి. దీంతో చాలా మంది స్టార్ నిర్మాతలకు పూజ హెగ్డే లక్కీ హీరోయిన్ గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ కరోనా తర్వాత ఇటీవల పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్నీ అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ప్రభాస్ తో “రాదేశ్యాం”, “ఆచార్య”.. రెండు కూడా భారీ అంచనాలతో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం జరిగింది. ఇటువంటి తరుణంలో పూజా హెగ్డే టైం బాలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు కామెంట్లు సోషల్ మీడియాలో సదరు హీరోల అభిమానుల నుండి వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న “భగత్ సింగ్… భవదీయుడు” ప్రాజెక్టులో ప్రారంభంలో పూజా హెగ్డే ని ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఆ సినిమాకి సంబంధించి డేట్స్ విషయంలో… అడ్జస్ట్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో… ఆ ప్రాజెక్ట్ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. దీంతో ఈ వార్త తెలుసుకుని పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆమె ఇటీవల నటించిన సినిమాలు దాదాపు పరాజయం పాలు కావస్తూ ఉండటంతో సెంటిమెంట్ పరంగా ఆమె తప్పుకోవడం … సినిమాకి మంచిదని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్త పై కామెంట్ చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!