Prabash: డార్లింగ్ ప్రభాస్ హీరోగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమా ‘ఉగ్రమ్’ కన్నడ చిత్రానికి రీమేక్ అని గుసగుసలు వినబడుతున్నా ఇంకా ఆ చిత్ర టీమ్ మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాను KGF నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈసినిమా విషయంలో ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
Lata Mangeshkar : దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరు… శోక సంద్రంలో మునిగిన సంగీత ప్రపంచం!
Prabash: ‘సలార్’ OTT రైట్స్ విలువ అంత!
ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమా OTT రైట్స్ కోసం అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్‌లు పోటీ పడుతున్నాయని సమాచారం. అందులో భాగంగా మొత్తం అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 350 కోట్లకు పైగా ఆఫర్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారట. అయితే ఈ విషయంలో మేకర్స్ ఇంకా తమ ప్రైస్ చెప్పలేదని వినబడుతోంది. ఈ విషయంలో ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం…!
అంత ఏముంది ఈ సినిమాలో?
ఇక సలార్ సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఇది కొంచెం మన రాజమౌళి ‘ఛత్రపతి’ ఛాయలు కలిగి ఉంటుంది. అవును.. ఇందులో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ ఇరగదీయనున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కి KGF లాంటి దమ్మున్న సినిమా తీసిన దర్శకుడు తోడవ్వడం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్లో ఉంటుందని ముందే ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!