Radhey Shyam: ‘రాధేశ్యామ్’ ఈ నెల 11 వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ గతంలో ఎన్నడూ కనిపించని పాత్రలో.. ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. పిరియాడికల్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ లో… విక్రమాదిత్య (ప్రభాస్) పాత్ర.. జాతకాలు చూసే పాత్ర…అని ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ప్రేరణ..(పూజా హెగ్డే) అనే అమ్మాయితో.. ప్రభాస్ లవ్ లో పడినట్లు వీళ్ళిద్దరి ప్రేమకు విధి.. పెద్ద ఆటంకమని .. దానిని భవిష్యత్ జ్ఞానం ఉన్న ప్రభాస్ ఎలా జయిస్తాడు అనేది సినిమా అన్నట్టు టాక్.
అయితే ప్రారంభంలో సినిమాలో విలన్ లు ఎవరు ఉండరు అన్న టాక్ వినపడగా తాజాగా రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ లో జగపతి బాబు కాస్త నెగిటివ్ పాత్రలో కనిపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో క్లైమాక్స్ భారీ రేంజ్ లో తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. చివరిలో సునామీ వస్తుందని టైటానిక్ మాదిరిగా…’రాధేశ్యామ్’ ప్రేమ కథని అద్భుతంగా చిత్రీకరించారు అని విక్రమాదిత్య క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందని… ప్రభాస్ అభిమానులకు రామాలు నిక్కబొడుచుకోవడం గ్యారెంటీ అని మేకర్స్ నుండి అందుతున్న టాక్.
పామిస్ట్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఇట్టే ఒదిగి పోయాడు అని సినిమా మేకర్స్ అంటున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే ‘రాధేశ్యామ్’ ఒక హిస్టారికల్ సినిమాగా నిలిచిపోతుందని చెప్పుకొస్తున్నారు. కృష్ణం రాజు నిర్మాణ సారథ్యంలో గోపి కృష్ణ మూవీస్.. యు.వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మా వచ్చే వారం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!