Prabhas: నేషనల్ స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్‌తో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత చిత్రీకరణను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ మూవీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేసేందుకు ప్రశాంత్ కసరత్తులు చేస్తున్నారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ప్రభాస్‌కు ఓ కొత్త కండీషన్ పెట్టారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సలార్ పాత్ర రీత్యా ప్రభాస్ ని స్లిమ్ గా మారాలని చెప్పారట. ఇందుకు కారణం లేకపోలేదు. మిర్చి మూవీలో హ్యాండ్సమ్గా కనిపించి భారీగా లేడీస్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్.. ఆ తర్వాత బాహుబలి సిరీస్‌లో పాత్రకు తగ్గట్టు కనిపించి ఆకట్టుకున్నారు. సాహోలో సైతం పర్వాలేదనిపించుకున్నా.. ఇటీవల విడుదలైన `రాధేశ్యామ్`లో ఏమంత అందంగా కనిపించలేదు. అభిమానులు కూడా ఆయన లుక్ విషయంలో పెదవి విరిచారు.
ప్రస్తుతం ఆయన ముఖంలో ఇంతకు ముందున్న కల కనిపించడం లేదు. దానికి తోడు ప్రభాస్ ఈ మధ్య బరుపు కూడా పెరిగారు. అందుకే ప్రశాంత్ నీల్ ఆయన్ను బరువు తగ్గి స్లిమ్ అండ్ హ్యాండ్సమ్గా మారాలని సూచించారట. ఆయన కోరిక మేరకు ప్రభాస్ తగ్గక తప్పడం లేదట. ఇప్పుడాయన జిమ్‌లో చెమటలు చిందిస్తూ వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని మరియు డైట్ ప్లాన్‌ను కూడా మార్చేశారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!