ఇప్పటికే డైరెక్టర్ పూరి చెంత చేరిన ఛార్మి ఆయన ప్రొడక్షన్ హౌస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో కొత్త నటీనటులను ఇండస్ట్రీకి అందించే ప్రయత్నం కూడా ఎప్పటి నుండో చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి మగవారికి సంబంధించిన దుస్తులను ఆన్లైన్లో సేల్ చేయబోతున్నారట. బి స్మార్ట్ డాట్ ఇన్ పేరుతో ఓ వెబ్సైట్ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ముందుగా ఆర్డర్ చేసిన వారికి 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తానని అంటుంది ఛార్మి. మరి ఈమె కొత్త వ్యాపారం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!