NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa 2: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..పట్టరాని ఆనందంలో బన్నీ ఫ్యాన్స్

Pushpa 2: పుష్ప: ది రైజ్ పార్ట్ 1 వచ్చి అనూహ్యంగా అత్యంత భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ మేకర్స్ కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ప్రకటించిన సినిమాల కంటే ముందు ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఫోకస్ పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సీక్వెల్ పుష్ప: ది రూల్  పార్ట్  2 మీద పెట్టారట. అంతేకాదు, ఇప్పటి నుంచే ఓ రిలీజ్ డేట్ టార్గెట్‌గా పెట్టుకొని సినిమాను ఆ సమయానికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు పక్కా ప్లాన్ పెట్టుకున్నట్టు తాజా సమాచారం. ఐకాన్ స్టార్ అనే క్రేజ్ తెచ్చి పెట్టిన సుకుమార్ ఈ సీక్వెల్ సినిమాను మొదటి భాగానికంటే నాలుగింతలు గ్రాండ్‌గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితులైన రచయిత బృందానికి పుష్ప: ది రూల్ కథను నరేట్ చేసి వారిచ్చిన సలహాలను పరిశీలించి పార్ట్ 1 లో జరిగిన కొన్ని లోపాలను సరిచేసినట్టు తెలుస్తోంది. పుష్ప రాజ్‌గా బన్నీ పర్ఫార్మెన్స్ మొదటి భాగంలోనే పీక్స్ అంటే ఇప్పుడు తెరకెక్కనున్న పార్ట్ 2లో అంతకు మించి అనేలా ఓ సరికొత్త మేనరిజాన్ని బన్నీకి పెడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్‌లో కూడా హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ ముగించుకొని వచ్చిన అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం సిద్దమవుతున్నారు. ఈ నెలలోనే ఈ మూవీ సెట్స్ మీదకు తీసుకువెళ్ళబోతున్నారు.

Pushpa 2: అదే తేదీకి సీక్వెల్‌ను కూడా రిలీజ్..!

మైత్రీ మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సీక్వెల్‌ను నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈసారి సీక్వెల్ కోసం మరో లెవల్‌లో సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారట. అయితే, మేకర్స్ తాజాగా పుష్ప సినిమా సీక్వెల్‌ను కూడా డిసెంబర్ 17నే రిలీజ్ చేయనున్నారట. పార్ట్ 1 ఇదే తేదీన వచ్చి సంచలన విజయం సాధించడంతో అదే తేదీకి సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేయాలని గట్టిగా మేకర్స్ డిసైడయ్యారట. వాస్తవంగా ఇంకా ముందే పార్ట్ 2 రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ, సెంటిమెంట్ ఫాలో అయితే బావుంటదనే ఉద్దేశ్యంతో మళ్ళీ కూడా డిసెంబర్ 17కి పుష్ప: ది రూల్ రానుందట.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri