RRR: “RRR” మార్చి 25 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ప్రభాస్ “రాదేశ్యాం” ఆశించిన స్థాయిలో అంచనాలనుఅందుకోవటంలో విఫలం కావటంతో…పాన్ ఇండియా మార్కెట్ పరంగా ఇప్పుడు సినిమా ప్రేమికులు “RRR” కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి.. ఈ సినిమా చేయడంతో దేశవిదేశాలలో సినిమా ప్రేమికులు…”RRR” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్.. టీజర్ లు.. సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి.
ముఖ్యంగా చరణ్, తారక్ కలిసి నటించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా అభిమానులు…”RRR” చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా 2020 జూన్ 30వ తారీకు రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా మొదలు పెట్టిన ఈ టైంలో నే చరణ్ ఎన్టీఆర్ షూటింగ్ లో గాయపడ్డ టంతో పాటు తర్వాత మహమ్మారి కరోనా వైరస్ రావటంతో… అనేకమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో అంతా అయిపోయింది ఇంక సినిమా విడుదల చేయాలి అని అనుకొని.. ఏకంగా బాలీవుడ్ మరియు సౌత్ లో కొన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో “RRR” ప్రీ రిలీజ్ ఈవెంట్ లు కూడా భారీ ఎత్తున జరిగాయి.
జనవరి 7వ తారీకు విడుదల చేయాలని.. గత ఏడాది డిసెంబర్ మాసంలో రాజమౌళి మరియు సినిమా హీరోలు హీరోయిన్లు భార్య తన ప్రమోషన్ కార్యక్రమాలు జరిపారు. సరిగ్గా విడుదల సమయానికి ఒమిక్రన్ వైరస్ కేసులు పెరిగిపోవటంతో మళ్లీ సినిమా వాయిదా పడింది. దీంతో ఈసారి ప్రస్తుతం బయట అంత పరిస్థితులు సాధారణ స్థితిలో ఉండటంతో… ఇంకా పది రోజుల వ్యవధిలో సినిమా విడుదల కానున్న తరుణంలో “RRR” ఫైనల్ ప్రమోషన్ కార్యక్రమాలకు జక్కన్న పెద్ద స్కెచ్ వేశారు. దుబాయ్ అదేవిధంగా కర్ణాటకలో రెండు పెద్ద ఈవెంట్ లు నిర్వహించి .. భారీ ఎత్తున సినిమా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో మార్చి 14 వ తారీకు నుండి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో “RRR” సినిమా యూనిట్ మళ్లీ పాల్గొంటుంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!