RRR: బాహుబలి, ఆర్ఆర్ఆర్..లతో ప్రపంచవ్యాప్తంగా తన డైరెక్షన్ దమ్మేంటో దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. ఈ రెండు సినిమాలలో టేకింగ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది అని ప్రపంచ సినీ ప్రేమికులకు తెలిసి వచ్చేలా చేశాడు. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే ప్రపంచానికి తెలిసేది. కానీ “బాహుబలి”.. “ఆర్ఆర్ఆర్” సినిమాలతో భారతీయ చలన చిత్ర రంగం అంటే రాజమౌళి అన్న స్టాంప్ పడిపోయింది. “బాహుబలి” యుద్ధ సన్నివేశాలు..ఆర్ఆర్ఆర్ లో పోరాట సన్నివేశాలు హలీవుడ్ రేంజ్ లో అతి తక్కువ బడ్జెట్ లో చూపించి.. అద్భుతంగా కనపరిచాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు..హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు… తెరకెక్కించాలి అంటే.. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని సినిమా మేకర్స్ అంటారు. దీంతో ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు నిర్మించడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్న పరిస్థితి. హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా నిర్మాణ సంస్థలు… జక్కన్న ఓకే అంటే.. సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇంత డిమాండ్ ఉన్న రాజమౌళికి హాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చిన సినిమా మరియు డైరెక్టర్ ఎవరో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం జరిగిందట. జక్కన్న కి ఇష్టమైన హాలీవుడ్ డైరెక్టర్.. మరియు యాక్టర్ గిబ్సన్.. అంట. ఇంకా ఇష్టమైన సినిమాకి వచ్చేసరికి బెనహర్. దాదాపు 20 సార్లు కంటే ఎక్కువగానే ఈ సినిమాని చూసినట్లు రీసెంట్ ఇంటర్వ్యూ లో రాజమౌళి బయట పెట్టడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో రాజమౌళి ఫుల్ జోష్ లో వున్నాడు. తాజాగా ముంబైలో సక్సెస్ మీట్ లో జక్కన్న పాల్గొని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!