సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను నేడు అధికారికంగా విడుదల చేశారు. `దర్బార్` పేరుతో సినిమా తెరకెక్కనుంది. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. యంగ్ లుక్‌లో రజనీకాంత్ కనపడుతున్నారు. పోస్టర్లో రజనీకాంత్ వెనుకవైపు ఇంకా పోలీస్ బెల్ట్, కుక్క, గేట్ వే ఆఫ్ ఇండియా, పోలీస్ కాషన్ ఇలాంటివి కనపడుతున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఇంతకు ముందు సోషల్‌మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. అలాగే సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. నయనతార, కీర్తిసురేష్ హీరోయిన్స్‌గా నటించబోయే ఈ చిత్రంలో నివేదాథామస్ రజనీకుమార్తెగా కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!