Ravi Teja: వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ “క్రాక్” సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పైగా పాండమిక్ సీజన్ లో 50 శాతం సెట్టింగ్ మాత్రమే థియేటర్లలో ఉన్న టైంలో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నమోదు చేసుకున్నాడు. అంతకుముందు వరకూ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు. ముఖ్యంగా పాండమిక్ సీజన్ నేపథ్యంలో … ఎవరూ కూడా సినిమాలు రిలీజ్ చేయ లేని, ధైర్యం లేని టైంలో.. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టడంతో..రవితేజ “క్రాక్” హిట్ పట్ల ఇండస్ట్రీ యావత్తు మొత్తం ఊపిరి పీల్చుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియాలో సెకండ్ వేవ్ పరిస్థితి దారుణం గా ఉండటంతో కేసులు లక్షల నమోదు కావటంతో చాలా రాష్ట్రాలలో అప్పటి లాక్ డౌన్ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. కర్ణాటక మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలలో థియేటర్ల సిట్టింగ్ శాతాన్ని కుదించడం జరిగింది. ఉత్తర భారతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి కొద్ది రోజుల్లో సినిమాలు రిలీజ్ చేయాలని భావించిన వారు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఏది ఏమైనా రవితేజ తన నెక్స్ట్ రిలీజ్ చేయబోయే సినిమా కిలాడి ఎట్టి పరిస్థితుల్లో .. ఖచ్చితంగా విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారు అట. థియేటర్లో సిట్టింగ్ 50శాతం ఉన్న గాని తగ్గేదే లేదు అన్న తరహాలో .. రవితేజ కిలాడి నిర్మాతలకు భరోసా ఇచ్చినట్లు ఫిలిం ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!