కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 80 కోట్ల బడ్జత్ తో తెరకెక్కిన సినిమా ‘కెజీఎఫ్’. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెంచిన ఈ కెజీఎఫ్ సినిమా 25రోజుల్లో అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబడుతూ మొత్తంగా ఇప్పటి వరకూ 200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రిపీటెడ్ ఆడియన్స్ ని రాబట్టడంలో పూర్తిగా సక్సస్ అయిన చిత్ర యూనిట్, నార్త్ లో షారుఖ్ సినిమాకి షాక్ ఇచ్చి భారీ వసూళ్లని రాబట్టింది. యష్ ని ఇండియన్ స్టార్ ని చేసిన కెజీఎఫ్ ని రాజమౌళి ముందుండి నడిపించాడు.
జక్కన మార్క్ తో ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించిన చిత్ర యూనిట్, ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమా తీసి మంచి హిట్ అందుకున్నారు. ఇదే జోష్ ని కొనసాగిస్తూ కన్నడ సినిమా మార్కెట్ మరింత పెంచుతూ కెజీఎఫ్ సినిమాని పాకిస్థాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియాలో రిలీజ్ అయిన చాప్టర్ 1ని పాకిస్థాన్ లో రిలీజ్ చేసి అక్కడ కూడా హిట్ అందుకుంటే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, కెజీఎఫ్ రెండో పార్ట్ రిలీజ్ అయ్యే నెల ముందే చాప్టర్ 1ని అక్కడ రిలీజ్ చేస్తే పార్ట్ 2 కూడా హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్న హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్… అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఇండియన్ సినీ అభిమానులని మెప్పించిన రాకీ భాయ్ పాకిస్థానీ ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తాడో చూడాలి.