RRR: దర్శకధీరుడు రాజమౌళి దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా..ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా సరణ్, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, చరణ్-ఎన్టీఆర్‌ల నటన, బలమైన భావోద్వేగాలు, కీరవాణి స్వరపరిచిన పాటలు, రాజమౌళి టేకింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తాయి. టాక్ అదిరిపోవడంతో.. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ సూపర్ కలెక్షన్స్‌ను కలెక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. మొదటి వారం మొత్తం మీద ఒక్క హాలిడే లేకున్నా కానీ 6 రోజులు నాన్ స్టాప్ రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రానికి ఉగాది పండగా బాగా కలిసొచ్చింది.
ఉగాది పండగ 9వ రోజున కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ 8వ రోజు ఈవినింగ్ షోల కోసం థియేటర్స్‌కు భారీగా తరలివచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఎనిమిదో రోజు మరో ఇండస్ట్రీ రికార్డ్‌ను చిత్తు చిత్తు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఎనిమిదో రోజు ఏకంగా రూ. 8.33 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
ఇంతకు ముందు వరకు 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అల వైకుంఠ పురంలో సినిమా రూ. 7.92 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ వసూల్ చేసిన చిత్రంగా ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసేసి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, చరణ్‌ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!